Allu Arjun: ప్రస్తుతం నేరుగా కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్టు
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2". ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తుంది. కలెక్షన్ల సునామీల క్రియేట్ చేస్తోంది. అయితే.. ఊహించని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు, అరెస్టు కావడం, మధ్యంతర బెయిల్ రావడంతో వంటి పరిణామాలు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ తరుణంలో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటీ?
పుష్ప సినిమా విడుదల రోజున ప్రీమియర్స్ షో సమయంలో విషాద ఘటన తీవ్ర దుమారం రేగింది. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో బాధిత కుటుంబం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయగా కేసు నమోదైంది. మొదటగా థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

అనంతరం చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ ను తరలించారు. ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11గా పోలీసులు చేర్చారు. గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
దీంతో పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఊరట కల్పించింది. కానీ, కోర్టు ఆర్డర్ ఉత్తర్వులు రావడం ఆలస్యం కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ విడుదలయ్యారు. అనంతరం సీని, రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఇదెలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ .. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన మహిళా అభిమాని రేవతి కుటుంబాన్ని తాను కలవలేకపోతున్నానని టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చట్టపరమైన కారణాల వల్ల తాను ఆ కుటుంబాన్ని నేరుగా కలువలేకపోతున్నాననీ, కానీ, వారికి అండగా నిలవలేకపోతున్నానని తెలిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కోన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ అవుతోంది.
కోర్టు అర్డర్స్, లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా తాను రేవతి కుటుంబాన్ని నేరుగా కలవకూడదని లాయర్లు సూచించినట్టు తెలుస్తోంది. కొన్ని చట్టపరమైన కారణాలతో బాధిత కుటుంబాన్ని తాను నేరుగా కలువలేకపోయాననీ, వారిని కలిసి పరామర్శించలేకపోయానని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు బన్నీ కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











