Pavani Karanam: పుష్ప రాజ్ అన్న కూతురు.. అందాల ఆరబోతను చూస్తే అంతే..

Pushpa 2 Pavani Karanam: ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. గతంలో పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. దాదాపు రూ. 1850 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో పుష్ప రాజ్ ను చిన్నాయన అంటూ పిలిచే ఓ క్యారెక్టర్ ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమా స్టోరీని మలుపు తిప్పే క్యారెక్టర్ లో పావని కరణం అనే నటి నటించింది. ప్రస్తుతం ఈ అమ్మకు సంబంధించిన ఫోటోషూట్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప 2. ఈ సినిమా ఎంతోమంది నటీనటులకు మంచి సక్సెస్ తో పాటు ప్రత్యేక గుర్తింపును అందించింది. ఈ సినిమా విజయం సాధించడంతో అందులో నటించిన ప్రతి క్యారెక్టర్ కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అలా స్పెషల్ రికగ్నైజ్ సంపాదించుకున్న నటులల్లో నటి పావనీ కరణం ఒకరు. పావని అంటే గుర్తుకు పట్టకపోవచ్చు. కానీ పుష్ప రాజ్ అన్నయ్య కూతురు. కావేరి పాత్రలో నటించిన అమ్మాయి అంటే టక్కున గుర్తుపడతారు. ఈ సినిమాలో కావేరి పాత్ర చాలా కీలకం.

Pushpa 2 actress pavani karanam latest photos viral in instagram

పుష్ప 2 సినిమా క్లైమాక్స్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఇంతకీ పుష్ప రాజ్ ను చిన్నాయన అంటూ తిరిగే క్యారెక్టర్ లో నటించిన పావని కరణం విషయానికి వస్తే.. ఈ అమ్మాయి మంచిర్యాల జిల్లాలో పుట్టి పెరిగింది. వెండితెరపై నటిగా కనిపించాలని కళతో హైదరాబాదులో అడుగుపెట్టింది. అలా యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్లలో పాల్గొంది. ఈ తరుణంలో చిన్నచిన్న సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం లభించింది. అలా'పరేషాన్' అనే సినిమాలో ఆమె నటించే అవకాశం అందుకుంది.

ఈ సినిమాలో 'శిరీష' అనే పాత్రలో నటించడం వల్ల పావనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో 'సమోసా తింటావా శిరీష 'అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ డైలాగ్ తో పాటు .. ఆ పాత్రలో నటించిన పావని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. పరేషాన్ సినిమాతోపాటు 'పైలం పిల్లగా' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది పావని కరణం. దీంతోపాటు హిట్ 2 టూలో కూడా ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ లో సిరీస్లలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇక పుష్ప 2 సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అజయ్ కూతురుగా అంటే.. పుష్పరాజ్ అన్న కుమార్తెగా కావేరి అనే పాత్రలో పావని కరణం నటించింది. ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిన క్లైమాక్స్ సీన్లలో పావని నటించిన కావేరి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. ఇలా ఈ అమ్మడు పుష్ప 2 సినిమాతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ అమ్మడు సినిమాలు, వెబ్ సిరీస్ లలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ రచ్చ చేస్తుంది. నిత్యం ఈ అమ్మడు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. అలాగే తన హాట్ హాట్ ఫోటోలకును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అలా తాజాగా వైట్ మోడరన్ డ్రెస్ లో హాట్ అండ్ స్టైలిష్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ లైకులు, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు కూడా పావని కరణం అందాలను చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X