నార్త్‌లో పుష్పగాడి మేనియా .. ప్రాణాలు తీసుకోబోయిన యువతి

తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ లేటెస్ట్ గా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ ఎఫెక్ట్ మాత్రం హిందీ ఆడియెన్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తే టాలెంటెడ్ నటి , నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

ఇపుడు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 1600 కోట్ల గ్రాస్ దగ్గరకి వసూళ్లు నమోదు చేసి రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం మన తెలుగు కంటే హిందీలోనే దుమ్ములేపుతోందని ముందు నుంచీ టాక్ ఉంది. హిందీ ఆడియెన్స్‌లో పుష్ప 2 మేనియా ఎలా ఉందో తెలియాలి అంటే అప్పుడు గతంలో పార్ట్ 1 సమయంలో జరిగిన పలు ఇన్సిడెంట్ లు కానీ ఇపుడు పార్ట్ 2 వచ్చాక జరుగుతున్న ఇన్సిడెంట్ లు చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

pushpa 2 again became hot topic in hindi audience with a suicide attempt

కాగా గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ యువ స్టూడెంట్ తన ఎగ్జామ్‌లో ఏకంగా 72 వేల సార్లకి పైగా పుష్ప 2 నామ జపం రాసి అదేదో రామ కోటి అన్నట్టుగా షాకిచ్చాడు. ఇదిలా ఉండగా ఇపుడు మరో క్రేజీ ఇన్సిడెంట్ వార్తల్లో వైరల్ గా మారింది. అయితే ఈసారి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిందట. ఈసారి పుష్ప 2 ఇద్దరు ప్రేమికుల నడుమ చిచ్చు పెట్టిందట.

ఇదెలా అంటే వారణాసిలోనే బి హెచ్ యూ (బనారస్ హిందూ యూనివర్సీటీ)కి చెందిన ఓ యువతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుందట. మరిన్ని వివరాల్లోకి వెళితే ఆ యూనివర్సిటీకి చెందిన అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. అయితే ఇపుడు హిందీ ఆడియెన్స్‌లో పుష్ప 2 మేనియా నడుస్తున్న నేపథ్యంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని అల్లు అర్జున్ సినిమా చూడాలని కోరిందట.

pushpa 2 again became hot topic in hindi audience with a suicide attempt

కానీ అతడు మాత్రం నేను పుష్ప 2 సినిమా చూడను అని మొండిపట్టు పట్టి ససేమిరా అన్నాడట. అంతే తన బాయ్ ఫ్రెండ్ ఆ సినిమా చూడలేదు అని ఈమె ఆత్మహత్యాయత్నం చేసేవరకు వచ్చిందట. ఈమె ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ షాకింగ్ వార్త ఇపుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ఇలా మొత్తంగా మాత్రం నార్త్ ఆడియెన్స్ లో పుష్ప 2 ఎఫెక్ట్ మాత్రం మామూలు లెవెల్లో లేదని చెప్పి తీరాలి. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ పుష్ప 2 సినిమా ఒక్క హిందీ వెర్షన్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ప్రస్తుతం 700 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా అక్కడ సినీ ట్రాకర్స్ చెబుతున్నారు. మరి ఈ లెక్కలు ఎక్కడ ఆగుతాయా అని వారు కూడా చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X