Allu Arjun: యంగ్ హీరోకు సారీ చెప్పిన అల్లు అర్జున్.. అసలేం జరిగిందంటే?
Allu Arjun- Kiran Abbavaram: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 హావా నడుస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీపై మరింత హైప్స్ క్రియేట్ అయ్యేలా.. తాజాగా పుష్ప 2 ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఈ సమయంలో ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు విషెస్ తెలుపుతూ ట్విట్స్ చేస్తున్నారు. కాగా.. అల్లు అర్జున్.. ఓ యంగ్ హీరో ట్విట్ కు రిప్లై ఇస్తూ క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పడానికి కారణమేంటి? మీరూ కూడా ఓ లూక్కేయండి.
ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2'లో హీరో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. ఇందులో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. డీఎస్పీతో పాటు తమన్ బ్యాక్ రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన అప్టేట్స్ పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలోనే 50 మిలియన్ వ్యూస్ అందుకుని పలు రికార్డులను క్రియేట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ తరుణంతో పుష్ప ట్రైలర్ పై సినీ సెలబ్రెటీలు,సినిమా రివ్యూస్ స్పందిస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్నేషనల్, వైల్డ్ ఫైర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే.. డైరెక్టర్ రాజమౌళి, హను రాఘవపూడి, ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ వంటి దర్శకులు ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పుష్ప 2 ట్రైలర్ పై ప్రశంసలు కురుపించారు. వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ (Allu arjun) కూడా రిప్లై ఇచ్చారు. " థాంక్యూ బ్రదర్.. నేను బిజీగా ఉండడం వల్ల మీ సినిమాని చూడలేకపోయాను. క్షమించండి .. తప్పకుండా నేను మీ సినిమా చూసి.. మీకు ఫోన్ చేస్తాను' అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. ఆ తరువాత హీరో కిరణ్ కూడా స్పందిస్తూ.. ' థాంక్యూ అన్న' అంటూ కూడా ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ క . దీపావళి కానుకగా విడుదలైన కా మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంటూ.. సక్సెస్ అందుకుంది. ఎవరు ఊహించని విధంగా 50 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ కిరణ్ అబ్బవరం కెరీర్లో బెస్ట్ మూవీ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా క మూవీ యూనిట్ ను పిలిచి అభినందించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











