పుష్ప 2 యాక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు .. ఆ నటుడు ఎవరో తెలుసా?

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు అలాగే టెక్నీషియన్స్ విషయంలో పలు షాకింగ్ ట్విస్ట్‌లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం యువ హీరో రాజ్ తరుణ్ నుంచి మొదలైన ఈ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం నేషనల్ అవార్డు విన్నింగ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వరకు వచ్చింది. అయితే జానీ మాస్టర్ విషయంలో వచ్చిన ఆరోపణలు ఒకింత సీరియస్‌గా మారాయని చెప్పాలి.

కానీ మాస్టర్ విషయంలో అసలు ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకోకుండానే తనని దోషిగా చూపించే ప్రయత్నం జరిగిందని స్వయంగా తన తోటి లేడీ డాన్స్ మాస్టర్స్ ఆరోపించారు. జానీ మాస్టర్ వల్ల ఇబ్బంది పడిన బాధితురాలికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండగా ఉంటానని చెప్పినట్లుగా చిత్రసీమలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఆమెకి తన సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చారు అంటూ పలు వార్తలు వచ్చాయి.

pushpa 2 another actor cheated a girl will allu arjun react

అన్నింటికి మించి ఎవరైనా ఆడపిల్లలని ఇబ్బంది పెడితే అల్లు అర్జున్‌కి చాలా కోపం వచ్చేస్తుందని ఫిలింనగర్‌లో చెప్పుకుంటూ ఉంటారు. దీనితో జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటాడు పైగా పవన్ వీరాభిమాని కూడా అని, పవన్ తో ఉండేవాళ్ళు తన పార్టీలో వారు ఇంతే అన్నట్టుగా ఆ మధ్య అల్లు ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు.

దీనికి ధీటుగా పవన్ ఫ్యాన్స్ కూడా ధీటుగా బదులిచ్చారు. ఆరోపణలు వచ్చిన వెంటనే జనసేన పార్టీ జానీ మాస్టర్ ని పక్కన పెట్టిందని కౌంటర్లు విసిరారు. కానీ అన్ని సూక్తులు చెప్పిన అల్లు అర్జున్ మాత్రం నటుడు జగదీశ్ బండారి (పుష్ప సినిమాలో కేశవ) పై కూడా లైంగిక ఆరోపణలు వచ్చి , ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఆత్మహత్యకు కారణమైన వాడిని జైలు నుంచి బయటకి తీసుకొచ్చి మరీ పక్కన పెట్టుకున్నాడు అంటూ ట్రోల్స్ చేసారు.

pushpa 2 another actor cheated a girl will allu arjun react

ఇపుడు దీనికి మించిన ట్విస్ట్ ఇదే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా నుంచే చోటు చేసుకుంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన మరో నటుడు లైగింక ఆరోపణల కేసులో ఇరుక్కున్నాడు. అతడే టాలెంటెడ్ నటుడు శ్రీతేజ్. పుష్ప 2కి ముందే చాలా సినిమాల్లో ఈ నటుడు నటించాడు. తనను శ్రీతేజ్ చీట్ చేసినట్లుగా ఓ యువతి హైదరాబాద్‌ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసిందట. ప్రస్తుతం ఈ వార్త చిత్ర సీమలో చక్కర్లు కొడుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇదే నటుడిపై గతంలో మరో కేసు కూడా అది కూడా ఓ వివాహేతర సంబంధం విషయంలో నమోదైనట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇన్ని జరుగుతుంటే ఇపుడు అల్లు అర్జున్ ఎక్కడా అంటూ తనపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అల్లు అర్జున్ & పుష్ప టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X