'పుష్ప 2' క్లైమాక్స్ బ్యాక్ సీన్స్ చూసారా .. లీక్ చేసిన పుష్ప రాజ్ కూతురు..
ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపుతున్న వన్ అండ్ ఓన్లీ చిత్రమే "పుష్ప 2". ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సెన్సేషనల్ చిత్రం రికార్డు వసూళ్లు అందుకొని దంచి కొడుతోంది. కాగా ఈ సినిమాపై కొంచెం నెగిటివ్ అండ్ మిక్డ్స్ రెస్పాన్స్ లు వచ్చినప్పటికీ ఇది పాన్ ఇండియా సక్సెస్ కొట్టడంతో అవన్నీ పుష్ప రాజ్ మేనియాలో కొట్టుకుపోయాయి.
ఈ చిత్రం ఇంతలా ఆదరణ అందుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. స్క్రిప్ట్ పరంగా వీక్ గా ఉంది? అదే రొటీన్ సెంటిమెంట్? అనే కామెంట్స్ కూడా వినిపించాయి . కానీ ఫైనల్ గా జనం మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన క్రేజీ సన్నివేశాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ కూడా ఒకటి.

అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విశ్వరూపం ప్రదర్శించిన ఈ సన్నివేశం సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఐతే ఈ చిత్రంలో కీలక యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్లాక్ లు అన్నీ ఒక్క అమ్మాయి చుట్టూనే తిరుగుతాయి. అంతా ఎంతో ఎదురు చూసిన జాతర సన్నివేశం కానీ.. ఇపుడు క్లైమాక్స్ లో చూపించిన రప్పా రప్పా సీన్ కానీ సినిమాలో పుష్ప రాజ్ కూతురు వరుస అయ్యిన అమ్మాయి కోసమే కనిపిస్తాయి.
తన అన్న కూతురు ఫస్ట్ పార్ట్, రెండో పార్ట్‌లో పుష్ప రాజ్‌ను చిన్నాయన చిన్నాయన అంటూ ఎంతో ప్రేమను చూపిస్తుంది. ఆమె కోసం పుష్ప రాజ్ చేసే పోరాటం అందరికీ ఓ రేంజ్ ఎగ్జైట్మెంట్ ని అందించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో పుష్ప రాజ్ కూతురిగా కనిపించిన ఆ యువ నటి పేరే పావని కరణం. ఈమె పుష్ప2 విడుదల తర్వాత నుంచి సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యింది.
ఇలా సినిమా సెట్స్ నుంచి సినిమా వర్క్ చేస్తున్న సమయంలో దిగిన ఫోటోలు సినిమా రిలీజ్ తర్వాత నుంచి షేర్ చేసుకోవడం మొదలు పెట్టింది. ఇలా లేటెస్ట్ గా పుష్ప 2 రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ లో వెనుక ఏం జరిగిందో అంటూ కొన్ని సీన్స్ సెట్స్ లో తన లుక్, మేకప్ కి సంబంధించి ఫోటోలు షేర్ చేసుకుంది. దీనితో ఇవి వెంటనే వైరల్ అయ్యిపోయాయ్.
తనకి గాయాలు, ఆ భారీ సెట్టింగ్స్ ని చూపిస్తూ పెట్టిన పిక్స్ చూసి ఐకాన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ భారీ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











