ఏకంగా 72 వేల సార్లు 'పుష్ప' పేరు .. ఎగ్జామ్‌లో రాసి షాకిచ్చిన స్టూడెంట్, ఎక్కడంటే?
ఇపుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క సెన్సేషనల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మాస్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 అనే చెప్పి తీరాలి. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టోటల్ భారతదేశం మొత్తం ఇంపాక్ట్ కలిగించే సినిమాలు కానీ ఆ సినిమాల్లో పాత్రలు కానీ కొన్ని ఉంటాయి. ఇవి ప్రతీ ఒక్కరిలో ఐకానిక్‌గా నిలిచిపోతాయి.
అలా ఇండియన్ సినిమా దగ్గర ప్రభాస్ చేసిన బాహుబలి, కన్నడ స్టార్ హీరో యష్ చేసిన రాకీ భాయ్ పాత్రలు ఒకపుడు మంచి ఇంపాక్ట్ కలిగించాయి. అయితే వీటితో పాటుగా మరో మాస్ రోల్ "పుష్ప" కూడా ఇపుడు నిలిచిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాత్రనికి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అద్భుతంగా పోషించగా తన మ్యానరిజం, తన డైలాగ్స్ లాంటివి ఇండియాలో ఒక్క తెలుగు ఆడియెన్స్‌లోనే కాకుండా ఇండియా వైడ్‌గా పాపులర్ అయ్యాయి.

ఇలా తెలుగు రాష్ట్రాలకి మించి హిందీ ఆడియెన్స్‌లో కూడా ఓ రేంజ్‌లో పుష్ప రాజ్ పాతుకుపోయాడు. గతంలో పార్ట్ 1కే హిందీ ఆడియెన్స్ థియేటర్స్‌లోనే కాకుండా బయట కూడా బ్రహ్మరథం పట్టారు. భారీ లెవెల్లో అల్లు అర్జున్ కటౌట్స్ పెట్టి మరీ పుష్ప రాజ్‌కి పట్టం కట్టగా ఇపుడు పుష్ప 2తో మళ్ళీ హిందీ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో హైప్ లేచింది.
ఇపుడు కూడా తెలుగు ఆడియెన్స్ కంటే హిందీ మార్కెట్‌లోనే భారీ వసూళ్లు అందుకోవడం , ఆల్రెడీ పలు స్పూఫ్‌లు, షార్ట్ ఫిలిమ్స్ లాంటివి కూడా హిందీ జనం చేసేస్తున్నారు. మరి దీనికి మించి హిందీ పుష్ప 2 ప్రభావం ఎంతలా పడిందో ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీకి చెందిన ఓ స్టూడెంట్ తన ఎగ్జామ్‌లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు రామకోటి లాగ ఏకంగా 72 వేల సార్లు "పుష్ప పుష్ప పుష్ప" అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయాడట. దీనితో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ ఇన్సిడెంట్‌లో ఆ స్టూడెంట్ టీచర్ మనోడి ఘనకార్యం చూసి షాకయ్యారట.
మరి ఇంత రాసిన తర్వాత ఫెయిల్ చెయ్యకుండా ఎలా ఉంటారు ఫెయిల్ చేశారట ఇది వేరే విషయం . కానీ హిందీ జనంలో మాత్రం పుష్ప 2 ప్రభంజనం ఈ రేంజ్‌లో ఉంది అంటూ సోషల్ మీడియాలో ఇపుడు కామెంట్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ హిందీ సినిమాలో పుష్ప 2 ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకోగా అక్కడ మరిన్ని రికార్డులు సొంతం చేసుకునే దిశగా వెళుతుంది.


Click it and Unblock the Notifications











