విదేశీ గడ్డపై పుష్ప 2 సరికొత్త చరిత్ర.. ఓవర్సీస్‌లో మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో భారీ అంచనాలు సెట్ చేసుకున్న మాసివ్ సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ సినిమా "పుష్ప 2" అనే చెప్పొచ్చు. కాగా పాన్ ఇండియా హిస్టరీలో ఒక ఎగ్జైటింగ్ క్లైమాక్స్ లు లు ఇచ్చిన బాహుబలి 1, కేజీయఫ్ చాప్టర్ 1 తరహా క్లైమాక్స్ లు లేకపోయినప్పటికీ కూడా ఇపుడు పుష్ప 2 పై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమా హైప్ ఒక్క ఇండియా లోనే కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా ఊహించని లెవెల్లో ఉంది. ఇలా రికార్డు బిజినెస్ ని పుష్ప 2 వరల్డ్ వైడ్ జరిపింది. అయితే అపుడు వరకు ఓవర్సీస్ లో మరీ అంత మార్కెట్ లేని అల్లు అర్జున్ ఈ ఒక్క సీక్వెల్ తోనే ఏకంగా 100 కోట్ల బిజినెస్ ని ఓవర్సీస్ మార్కెట్ లో చేసాడు.

pushpa 2 created history from indian cinema in usa theaters

దీనితో అక్కడ మార్కెట్ లో కూడా పుష్ప 2 హైప్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా పుష్ప 2 మీద అంచనాలు ఇలా అంతకంతకూ పెరుగుతూ వస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా ఊహించని లెవెల్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా విదేశీ గడ్డపై ఇది వరకు ఏ ఇండియన్ సినిమాకి కూడా జరగని రీతి ప్రమోషన్స్ ఇపుడు పుష్ప 2 సొంతం అయ్యాయి.

జెనరల్ గా యూఎస్ లాంటి దిగ్గజ దేశాల్లో సినిమాలు అక్కడి థియేటర్స్ లో క్లాస్ హంగులకి అక్కడ జనాన్ని ఆకట్టుకోవడానికి పలు హాలీవుడ్ సినిమాలు సైతం తమ సినిమాలు పోస్టర్ లు ఇతర ప్రమోషనల్ కంటెంట్ ని అక్కడ థియేటర్స్ లో పాప్ కార్న్ షీట్స్ మరియు సాఫ్ట్ డ్రింక్ కవర్లుపై వేయించి ప్రమోషన్స్ చేసుకుంటారు.

pushpa 2 created history from indian cinema in usa theaters

అయితే ఇన్నేళ్ల హిస్టరీలో అది కూడా యూఎస్ వంటి దేశాల్లో కేవలం హాలీవుడ్ సినిమాలకి మాత్రమే దక్కిన ఈ రీతి ప్రమోషన్స్ ఇపుడు పుష్ప 2 సొంతం అయ్యాయి. ఇండియన్ సినిమా నుంచి ఆ తర్వాహ ప్రమోషన్స్ చేసుకుంటున్న ఏకైక సినిమాగా ఇపుడు పుష్ప 2 చరిత్ర సృష్టించినట్టుగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. దీనితో ఇది ఒక కొత్త స్టెప్ అనే చెప్పాలి.

అల్లు అర్జున్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అలా ఇపుడు కూడా పుష్ప 2 తో ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా స్టార్ట్ చేయని ట్రెండ్ ని మొదలు పెట్టాడు అని చెప్పాలి. ఇక ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే శ్రీలీల మరియు సమంతాలపై ఓ క్రేజీ ఐటెం సాంగ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని సినిమా వరల్డ్ వైడ్ డిసెంబర్ 5న రిలీజ్ కి వస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X