సుకుమార్‌ను చెడగొట్టింది ఆ పెద్దమనిషే .. రాముడి లాంటి వ్యక్తిని, చివరికి
తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు వున్నారు. తమ ప్రతిభతో వీరంతా టాలీవుడ్ స్టాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి చేరుకోవడం వెనుక ఈ డైరెక్టర్ల కృషి ఎంతో ఉంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వేసిన పాన్ ఇండియా మూవీస్ బాటలో తెలుగు సినిమాను మరో మెట్టు పైకెక్కించారు సుకుమార్. ఆయన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించడంతో సుకుమార్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.
ఓ లెక్కల మాస్టర్ స్థాయి నుంచి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్. అందరిలా మూసలో కొట్టుకుపోకుండా విభిన్నమైన కథలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుక్కు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్యతో వెండితెరకి ఆయన పరిచయం అయ్యారు . తొలి సినిమాతోనే డిఫరెంట్ సబ్జెక్ట్ డీల్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ వెంటనే రామ్ హీరోగా జగడం తెరకెక్కించారు.

ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఆర్య 2, నాగచైతన్యతో 100 % లవ్‌లు తీసి సక్సెస్ కొట్టారు. ఈ క్రమంలో ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అదే వన్ నేనొక్కడినే. టాలీవుడ్‌లో గతంలో ఎన్నడూ రాని విధంగా డిఫరెంట్ టేకింగ్‌తో ఈ సినిమాను తీశాడు సుకుమార్. ఇది కమర్షియల్‌గా వర్కవుట్ కాలేకపోయినా .. సుకుమార్ డైరెక్షన్‌కి, మహేశ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాలు తీసి టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్పతో దేశాన్ని ఒక ఊపారు.
పుష్ప 1కి సీక్వెల్‌గా డిసెంబర్ 5న రిలీజైన పుష్ప 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఇక సుకుమార్ రైటింగ్స్ పేరిట బ్యానర్ స్థాపించి తన శిష్యులను డైరెక్టర్‌లుగా మార్చాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఎంతో ఎత్తుకు ఎదిగిన సుకుమార్‌ను చిత్ర పరిశ్రమలో అంతా ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. మీడియాకు, పబ్లిసిటీకి దూరంగా ఉండే సుకుమార్ వివాదాలకు, కాంట్రవర్సీల జోలికి వెళ్లరు.

కాగా.. సుకుమార్ డైరెక్షన్ అనగానే ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చేది ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్, టేకింగ్. వీటితో పాటు ఐటెం సాంగ్స్‌కు సుకుమార్ పెట్టింది పేరు. తొలి చిత్రం ఆర్యలో అ అంటే అమలాపురం దగ్గరి నుంచి నేటి పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ వరకు ఆయన స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా మారారు. ఆయన టేకింగ్‌కు తోడు కొరియోగ్రఫి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో ఈ సాంగ్స్ మాస్‌ని ఒక ఊపు ఊపేస్తున్నాయి. సమంత, పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్స్‌ని ఆయన తన ఐటెం సాంగ్స్‌తో మరింత ఎత్తుకు చేర్చారు.
నిజానికి ఆర్యలో అభినయశ్రీతో తీసిన ఐటెం సాంగ్ పెట్టాలని సుకుమార్‌కు లేదట. నిర్మాత దిల్ రాజు ఒత్తిడి మేరకు అయిష్టంగానే దానికి ఒప్పుకున్నారట. కానీ సినిమా విడుదలై అ అంటే అమలాపురం పాట తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. దీంతో ఐటెం సాంగ్ రీచ్ చూసి ఆశ్చర్చపోయిన సుక్కూ.. అప్పటి నుంచి తన ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.


Click it and Unblock the Notifications











