అల్లు అర్జున్ నా కాళ్లు పట్టుకుని .. సంచలన విషయం బయటపెట్టిన సీనియర్ నటి , ఏం జరిగిందంటే?

దివంగత మహానటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు బన్నీ. రూ.100 రెమ్యునరేషన్‌తో స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ ఏకంగా రూ. 300 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు.

తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో స్టైలీష్ స్టార్‌గా యువతలో సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ తన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. నటన, డైలాగ్స్, ఫైట్స్‌తో పాటు ఈ జనరేషన్‌ తెలుగు హీరోల్లో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా మారారు. ఎంతటి క్లిష్టమైన మూవ్‌మెంట్స్ అయినా సరే అలవోకగా చేస్తూ మావయ్య చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టారు. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి సినిమాలతో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం, పుష్ప చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. పుష్ప చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై.. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డుల్లోకెక్కారు అల్లు అర్జున్.

pushpa 2 fame kalpalatha made sensational comments on allu arjun

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి సమయం కేటాయిస్తారు బన్నీ. షూటింగ్‌లు లేకపోతే ఇంట్లో గడపటమో లేదంటే భార్యాబిడ్డలతో కలిసి విదేశాలకు వెళ్లడమో చేస్తుంటారు. ఇక స్నేహానికి ప్రాణమిచ్చే అల్లు అర్జున్ మిత్రుల కోసం ఏం చేసేందుకైనా వెనుకాడరు. పుష్పకి సీక్వెల్‌గా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 ది రూల్ యావత్ భారతదేశాన్ని షేక్ చేస్తోంది. మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఎక్కడో నిలబెట్టినందుకు సుకుమార్‌కు ధన్యవాదాలని.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునేలా చేస్తుందనే ఉద్దేశంతోనే తాను పుష్ప 2 చేశానని అల్లు అర్జున్ చెప్పారు. ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటపై బన్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి రూ. 25 లక్షలతో పాటు పరిస్థితులు చక్కబడిన తర్వాత వ్యక్తిగతంగా రేవతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యక్తిత్వం, పెద్ద మనుసుపై ప్రశంసల వర్షం కురిపించారు పుష్పలో బన్నీకి తల్లిగా నటించిన కల్పలత. ఓ ఛానెల్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హాస్పిటల్‌లో కాళ్లు పట్టుకునే సీన్ ఉందని, ఆయన నా కాళ్లు పట్టుకోగానే వణికిపోయానని చెప్పాడు. అంత పెద్ద స్టార్ అయ్యుండి నటన అంటే ప్రాణం పెట్టేస్తాడని కల్పలత అన్నారు. సింగిల్ షాట్‌లో ఈ సీన్ ఓకే చేశామని.. అది పూర్తయ్యాక చాలా బాగా చేశానని అల్లు అర్జున్ తను మెచ్చుకున్నారని కల్పలత గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X