Pushpa 2 Jathara Episode: పుష్ప 2 మూవీలో 15 నిమిషాల ఫైట్‌కు ఎన్ని కోట్ల ఖర్చో తెలుసా?

Pushpa 2 Jathara Episode: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 (Pushpa the Rule). ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఐకాన్ స్టార్ అభిమానులే కాదు యావత్తు సీని లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్తో అంచనాలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా.. బన్నీ సినిమా కు సంబంధించిన లీక్స్ కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. తాజా ఈ మూవీలో మెయిన్ పార్ట్ అయిన గంగమ్మ తల్లి జాతర ఫైట్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ క్రేజీ న్యూస్ ఏంటీ?

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్'(పుష్ప 1) ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎవరూ ఊహించని రేంజ్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఈ భారీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప 2' త్వరలో రానున్నది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా కొట్లాదిమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Pushpa 2 Jathara Episode Update Mythri movie makers spent around 60 crores for the Pushpa 2 Jatara episode

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సిరీస్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే.. పుష్ప 1 లో ఒక కూలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. పుష్ప 2 లో ఎర్రచందనం సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడు? ఆ తరువాత పుష్పరాజ్ కు ఎదురై ఇబ్బందులు ఏమిటి? స్మగ్లింగ్ మాఫీయా దాడుల నుంచి ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో 'పుష్ప ది రూల్‌' రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి రివీల్ అయినా.. గ్లిప్స్ , పోస్టర్స్, టీజర్ లు, అలాగే.. గంగమ్మ తల్లి గెటప్‌లో అల్లు అర్జున్‌ లుక్ చూసి సినీ ప్రపంచం షాక్ అయ్యింది. ఇలా 'పుష్ప 2' మూవీపై అంచనాలను మరింతగా పెంచేశారు. రిలీజ్‌కి ముందే పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1065 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.

తాజాగా ఇన్ పుట్స్ ప్రకారం.. పుష్ప 2 మూవీలోని గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 60 కోట్లు వెచ్చించారట. సినిమాలో ఈ జాతర ఎపిసోడ్ దాదాపు 15 నుండి 18 నిమిషాల పాటు ఉండబోతుందట. ఈ ఎపిసోడ్ పుష్ప 2 మూవీకి హైలెట్ గా నిలువబోతుందట. ఫైట్ సీక్వెల్ కోసం 60 కోట్లు ఖర్చుపెడితే.. ఫైట్ రిహార్సల్స్ కోసం దాదాపు 14 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫైట్ కోసం దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఫైట్ మాస్టర్లు పనిచేసినట్టు తెలుస్తుంది. దీనిని రెండు నెలపాటు చిత్రీకరించినట్లు సమాచారం. మూవీ మూవీలో జాతర ఎపిసోడ్ తో పాటు ఫ్రీ క్లైమాక్స్ లు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్.

Pushpa 2 Jathara Episode Update Mythri movie makers spent around 60 crores for the Pushpa 2 Jatara episode

పుష్ప 2 మూవీ కోసం హీరో అల్లు అర్జున్ కూడా భారీ మొత్తంలో రెమ్యునేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాఫిట్ షేరింగ్, హక్కుల రూపంలో దాదాపు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇలాంటి అప్డేట్స్ వస్తుంటే.. మూవీపై ఇక హైప్స్ పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ఈజీగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుకుంటుందనీ, అదే పాజిటివ్ టాక్ వస్తే 'పుష్ప 2' మూవీ బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజు సునామిని ఆపడం ఎవరి వల్ల కాదు. బాక్సాపీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X