pushpa 2 kissik song : ఒకే ఒక్క ఐటెం సాంగ్ .. వెలుగులోకి ఇన్ని కాంట్రవర్సీలా?
రీసెంట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో పలు అంశాలు మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి అని చెప్పాలి. కాగా వీటిలో కేవలం ఒకే ఒక్క సినిమా నుంచి పలు కాంట్రవర్సీలు కేంద్రీకృతంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. మరి ఆ సినిమానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ సీక్వెల్ మూవీ పుష్ప 2. కాగా ఈ సినిమా నుంచి ఊహించని కాంట్రవర్సీలు అసహనాలు కనిపిస్తున్నాయి అని చెప్పాలి.
ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఇటీవల వచ్చిన ఐటెం సాంగ్ కిస్సిక్ సాంగ్ ఈవెంట్ దెబ్బతో అయితే చాలానే మారిపోయాయి అని చెప్పాలి. కాగా ఈ ఈవెంట్‌లో సాంగ్ కంటే మేజర్‌గా మూడు అంశాలు బాగా హైలైట్ అయ్యాయని చెప్పాలి. అయితే వీటిలో ఒకటి పాజిటివ్ అంశం ఐతే మరో రెండు నెగిటివ్ అని చెప్పాలి.

మరి పాజిటివ్ నుంచే స్టార్ట్ చేద్దాం. గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న గాసిప్స్ విషయంలోకి వెళితే.. విజయ్ దేవరకొండ అలాగే పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన్నాల ప్రేమ వ్యవహారానికి ఒక ఎండ్ కార్డు దాదాపు పడిపోయేలా రష్మిక ఇచ్చిన ఆన్సర్ వైరల్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే కిస్సిక్ సాంగ్ ఈవెంట్‌ని డామినేట్ చేస్తూ దేవిశ్రీ ప్రసాద్‌కి ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి ఉన్న కోల్డ్ వార్ బట్టబయలు చేసింది.
ఎప్పుడు లేని విధంగా దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ సంగీత దర్శకుణ్ణి కాదని రీరికార్డింగ్ కి వేరే వాళ్ళని పెడుతుండడం పెద్ద చర్చకే దారి తీసింది. దీనితో ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి అనుకుంటున్న వారి అందరికీ కూడా క్లారిటీ ఇస్తూ దేవిశ్రీ ప్రసాద్ కుండ బద్దలు కొట్టేలా మాట్లాడి అందరికీ షాకిచ్చాడు. ఇక ఫైనల్ గా అయితే ఇది బిగ్గెస్ట్ కాంట్రవర్సీ అని చెప్పి తీరాలి.

నెలలు తరబడి అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానులు మెయిన్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నడుమ జరుగుతున్న వాగ్వాదంలో డైరెక్ట్ గా అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్ మరింత కాంట్రవర్సీకి దారి తీసింది. పవన్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టిన కాంట్రవర్సియల్ ఫ్లెక్స్ తో కూడిన పోస్ట్ ని అల్లు అర్జున్ షేర్ చేయడం , మళ్ళీ దానిని డిలీట్ చేయడంతో పవన్ అభిమానులకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ఇలా ఒకే ఒక్క ఐటెం సాంగ్ దెబ్బకి మూడు క్రేజీ అంశాలు హైలైట్ గా మారాయని చెప్పాలి. ఇక ఈ కిస్సిక్ సాంగ్ కి ఎప్పటిలానే మొదట నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ తో ఈ సాంగ్ ఇపుడు ఇండియా లోనే మోస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ గా 24 గంటల్లోనే రికార్డ్స్ బ్రేక్ చేసింది. కాగా ఈ సాంగ్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల అల్లు అర్జున్ సరసన నటించగా ఆమెకి మాత్రం అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని చెప్పాలి.


Click it and Unblock the Notifications











