Pushpa 2: పుష్ప2 నుంచి ఫస్ట్ పాట ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడు రాబోతుందంటే?
పుష్ప.. పుష్ప రాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేయగా.. త్వరలోనే పుష్ప 2 కూడా రాబోతుంది. అయితే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలు నమోదు కాగా అందా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే మూవీ టీం అదిరిపోయ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది. అంతేకాదండోయ్.. ఈ పూర్తి పాటను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో కూడా ప్రకటించారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ మూవీ పుష్ప 2 ది రూల్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి పార్టులో భాగంగానే ఈ సినిమాలో కూడా బన్నీ పుష్ప రాజ్ గానే కనిపించబోతున్నాడు. అయితే పార్ట్ 2 ను కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి మరింత సక్సెస్ సాధించాలనే పట్టుదలతో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ పుష్ప 2 తెరకెక్కించారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు పోటీగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే హీరో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి వాళ్లు కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా... ఈ సినిమాను ఏప్రిల్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇక అప్పటి నుంచి ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్ డేట్లు వస్తాయా అని అంతా ఆసక్తిగా చూస్తుండగా.. అదిరిపోయే న్యూస్ చెప్పింది మూవీ టీం. ముఖ్యంగా ఈ సినిమా నుంచి తొలి పాట ప్రోమోను ఈరోజు విడుదల చేసింది. పుష్ప, పుష్ప, పుష్ప, పుష్ప, పుష్ప అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉంది. ఓవైపు ఓ పాటు వస్తుండగా.. పుష్ప రాజ్ లుక్ ను కూడా చూపించారు. చేతి నిండా ఉంగరాలతో చేతులను చూపించారు. అలాగే ఈ ప్రోమోతో పాటు ఈ పూర్తి పాటను ఎప్పుడు విడుదల చేయబోతున్నారో కూడా వివరించారు.
పుష్ప 2 ది రూల్ సినిమా ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ ను మే ఒకటవ తేదీన ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఈ ప్రోమోలో వెల్లడించారు. చివర్లో ఈ వివరాలు పడగా.. అంతా ఈ పాట కోసం తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న ప్రోమోతోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్న మేకర్స్.. ఫుల్ సాంగ్ తో పూనకాలు తెప్పిస్తారేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











