Pushpa2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప2 నుంచి తొలిపాట విడుదల.. ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా రాబోతున్న క్రేజీ మూవీ పుష్ప 2 ది రూల్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప రాజ్ గా ప్రపంచ సినీ ప్రేమికులు అందరినీ అలరించిన అల్లు అర్జున్.. మరోసారి అదే క్యారెక్టర్ లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. కేవలం ఇండియాలోనే కాకుండా అనేక దేశాల్లోనూ కాసుల వర్షం కురిపించింది. అయితే పార్ట్ 2 ను కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి మరింత సక్సెస్ సాధించాలనే పట్టుదలతో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ పుష్ప 2 తెరకెక్కించారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి వాళ్లు కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా... ఈ సినిమాను ఏప్రిల్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ విషయం తెలిసినప్పటి నుంచి అటు బన్నీ, ఇటు సుక్కు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ పై ఓ కన్నేస్తున్నారు. అలాంటి వారికోసమే అన్నట్లుగా చిత్రబృందం ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా నుంచి తొలి లిరికల్ పాటను విడుదల చేయబోతున్నట్లు వివరించారు. దీనికోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ముఖ్యంగా ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 4.05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది.

పుష్ప 2 ది రూల్ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో రేపే రాబోతున్నట్లు ఎక్స్ వేదికగా మూవీ టీం ప్రకటించింది. ముఖ్యంగా చేతి గుర్తును రివర్స్ లో ఉన్న ఫొటోను షేర్ చేసి మరీ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల తేదీని చెప్పింది. అయితే అది పుష్ప రాజ్ చేయి అని అంతా అనుకుంటున్నారు. ఒక్క పోస్టర్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న మేకర్స్... టీజర్ తో ఏ రేంజ్ లో అంచనాలు పెంచేస్తారో చూడాలి మరి. అయితే చిత్రబృందం ఈ విషయం ప్రకటించిన క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











