పుష్ప 2 రిలీజ్ అధికారికంగా వాయిదా.. అల్లు అర్జున్ రిలీజ్ ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రంపై వస్తున్న రూమర్లు, ఊహాగానాలకు మైత్రీ మూవీ మేకర్స్ తెరదించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ వాయిదాలపై అనేక కథనాలు వచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
పుష్ప చిత్రం అల్లు అర్జున్‌కే కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఉన్నత స్థానంలో నిలిపింది. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడం మరో విశేషం కావడంతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు తగినట్టుగానే మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే అందరూ ఆగస్టు 15 కోసం ఆతృతగా ఎదురు చూస్తుండటం గమనార్హం.

అయితే మీడియాలో ఊహగానాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను ఆగస్టు 15 రిలీజ్‌ను వాయిదా వేసి.. డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే షూటింగ్ పూర్తికాకపోవడం, అలాగే పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడమే రిలీజ్ వాయిదాకు కారణమని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా టెక్నికల్‌గా మరింత సాంకేతికంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేలా సినిమాను ముస్తాబు చేస్తున్నాం అని మైత్రీ మూవీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సుకుమార్ బీ
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈవో: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్


Click it and Unblock the Notifications











