'ఆ భయంతోనే పుష్ప 2 వాయిదా.. చిరంజీవి వద్ద అల్లు అర్జున్ తప్పు ఒప్పుకుంటేనే'

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప-1 దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. 1980-90 దశకాలలో చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2021 డిసెంబర్‌లో రిలీజైన పుష్ప రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలో దిగి హిందీ జనాలను ఊపేసింది. దీంతో పుష్ప-2 కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న టైంలో చిత్రయూనిట్ షాకిచ్చింది. పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్‌కు, ఆయన అభిమానులకు భయపడే పుష్ప-2 రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తన మేనమామ పవన్ కళ్యాణ్‌కు కాకుండా ఆయన బద్ధ శత్రువు వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిల తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు.

pushpa 2 Postponement production boy made sensational comments on icon star allu arjun behaviour

ఆ సమయంలోనే మెగా, పవన్ ఫ్యాన్స్‌పై బన్నీపై ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన ట్వీట్ అంతకుమించిన దుమారం రేపింది. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి పవన్ తొలిసారిగా చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. కనీసం మామయ్యకి సోషల్ మీడియా ద్వారానైనా విషెస్ చెప్పలేదు బన్నీ. ఇలాంటి దశలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్‌ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాలతో మెగా, పవన్ అభిమానులు బన్నీపై గుర్రుగా ఉన్నారు. గతంలో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ అన్న ఒక్క మాటతో ఆయన నటించిన ఓ సినిమాపై కసి తీర్చుకున్నారు అభిమానులు. పైగా సినీ పరిశ్రమను , తమ అభిమాన హీరోలను తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ దారుణంగా అవమానించారని మిగిలిన ఫ్యాన్స్ కసితో రగిలిపోతున్నారు. అలాంటిది అల్లు అర్జున్ .. వైసీపీ తరపున ప్రచారానికి వెళ్లడమేంటని ఆరోజునే పెదవి విరిచారు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లో పుష్ప-2ని దించితే తాము తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని దర్శక నిర్మాతలు భావించే సినిమాను వాయిదా వేశారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

pushpa 2 Postponement production boy made sensational comments on icon star allu arjun behaviour

అయితే పుష్ప -2ని ఆపివేయడానికి దారి తీసిన కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్ప -1 మూవీకి ప్రొడక్షన్ బాయ్. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత పరిస్ధితులతో దర్శకుడు సుకుమార్ సైతం ఎంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పుష్ప సిరీస్‌లో కీలకపాత్ర పోషించిన ఓ నటుడు సినిమా వాయిదాల మీద వాయిదా పడటంతో ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. సినిమా వాయిదా పడటంతో అతని డేట్స్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. చివరికి ఆ నటుడికి కోపం వచ్చి మరొకరిని చూసుకోమంటూ సైడ్ అయిపోయాడని , దీంతో పుష్ప -2 పరిస్ధితి దారుణంగా తయారైందని వ్యాఖ్యానించాడు. జరిగిందేదో జరిగింది అల్లు అర్జున్ చిరంజీవి దగ్గరకి వెళ్లి క్షమించమని అడిగితే ఆయన ఖచ్చితంగా మన్నిస్తారని .. ఎందుకంటే చిరంజీవికి క్షమాగుణం ఉందని అతను అన్నాడు.

More from Filmibeat

Read more about: pawan kalyan allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X