Allu Vs Mega: అల్లు, పవన్ ఫ్యాన్ వార్.. పుష్ప నిర్మాత హాట్ కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న హాట్ టాపిక్ చర్చల్లో మెగా అండ్ అల్లు ఫ్యామిలీ కాంట్రవర్సీ కూడా అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల దెబ్బకి చాలానే షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనితో ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలతో పాటుగా సినీ ప్రముఖులు వారి అభిమానుల నడుమ చిచ్చు ఓ రేంజ్ లో రేగింది. ఇక ఈ కాంట్రవర్సీ ప్రధానంగా ఎవరి కోసం అనేది కూడా ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.

యెస్ ఇది అల్లు అర్జున్ కోసమే.. తను తన ఫ్రెండ్ అంటూ వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించడం అనేది మెగా అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. తమ కుటుంబం నుంచి ఎదిగి తమ కుటుంబానికి కాకుండా వ్యతిరేకంగా ఉన్న పార్టీ అభ్యర్థికి వెళ్లి బన్నీ మద్దతు ప్రకటించడం తో ఒక్క మెగా అభిమానులకు మాత్రమే కాదు మెగా కుటుంబంలో కూడా కొంతమందికి నచ్చలేదనే టాక్ వచ్చింది. దీనితో మెగా అభిమానులు వర్సెస్ అల్లు అర్జున్ అభిమానులు అంటూ సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ లేచిపోయింది.

Pushpa 2 producer hot comments over seeking mega support indirectly

కాగా ఆఫ్ లైన్ లో కూడా అల్లు అర్జున్ చర్యలు బలంగా నాటుకున్నాయి. దీని ఫలితం పుష్ప 2 సినిమా ఉంటుంది అని ఒక టాక్ మొదలైంది. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ చేసిన పని అయితే తమకి నచ్చలేదు అని బయట మెగా అభిమానులు తెగేసి చెప్పారు. తాము అల్లు అర్జున్ సినిమాలు చూడబోయేది లేదు అని పుష్ప 2 నుంచే ఇది మొదలు అవుతుంది అన్నట్టుగా ఆఫ్ లైన్ లో మాత్రం ముఖ్యంగా మెగా అభిమానులు అత్యధికంగా ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా వినిపించింది.

దీనితో పుష్ప 2 కి మెగా అభిమానుల ఎఫెక్ట్ ఉంటుంది అనే టాక్ కూడా మొదలైంది. అయితే ఇదే అనుమానం సినిమా మేకర్స్ లో కూడా లేకపోలేదు. దీనితో నేడు ఏర్పాటు చేసిన భారీ నేషనల్ ప్రెస్ మీట్ లో పుష్ప నిర్మాత యెర్నేని నవీన్ చేసిన కామెంట్స్ ఇపుడు ఆసక్తికరంగా మారాయి. మెగా అభిమానులు ఎప్పుడూ ఒకటే అని ఎన్నికల సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు కానీ సినిమాని అందరూ చూడాలి అనుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

Pushpa 2 producer hot comments over seeking mega support indirectly

దీనితో ఇవి చూస్తుంటే మెగా అభిమానులను తమ సినిమా చూడమని బుజ్జగిస్తున్నట్టే ఉందని చెప్పాలి. బయట రాష్ట్రాల్లో ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఏంటి అనేది అందరికి తెలుసు. మరి ఈ క్రమంలో పుష్ప నిర్మాత చేసిన కామెంట్స్ ఇపుడు మరింత ఆసక్తి రేపాయి చూడాలి మరి మెగా అండ్ అల్లు కాంట్రవర్సీలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఇక ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని మేకర్స్ డిసెంబరు 6 కాదు 5న విడుదల చేస్తున్నట్టుగా కూడా బిగ్ అనౌన్స్మెంట్ ని చేశారు. ఇపుడు ఈ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X