పవన్ కళ్యాణ్ స్థాయేంటీ.. బన్నీ గురించి మాట్లాడతాడా, పుష్ప ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్
టాలీవుడ్‌లో ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చొంది. ఇండస్ట్రీ నుంచి సామాన్యుల వరకు ఏ నలుగురు కలిసినా అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు సినిమా వాళ్లు, హీరోల అభిమానులకే పరిమితమైన ఈ వ్యవహారంలోకి జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, చలమలశెట్టి రమేష్ బాబులు ఎంటర్ కావడంతో ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది.
చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి నంద్యాలలో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేయడం వరకు అల్లు అర్జున్ తీరు వివాదాస్పదమైంది. ఈ పరిణామాలతో మెగా , పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్.. అల్లు అర్జున్ , స్నేహారెడ్డిల సోషల్ మీడియా ఖాతాలను సాయిథరమ్ తేజ్ బ్లాక్ చేయడం వంటి అంశాలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మెగా- అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ఫిలింనగర్ టాక్.

ఇదే సమయంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గతంలోనే ప్రకటించింది. కానీ అనూహ్యంగా పుష్ప-2 విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ సంచలన ప్రకటన చేయడంతో బన్నీ ఫ్యాన్స్ షాకయ్యారు. ఈ మూవీని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది. మెగా ఫ్యాన్స్‌కు భయపడే పుష్ప-2 రిలీజ్‌ను వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు అల్లు అర్జున్ గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు. కానీ కొద్దిరోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి హోదాలో కర్ణాటకలో పర్యటించిన పవన్.. బన్నీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రలు పోషించేవారని, కానీ ఇప్పుడున్న హీరోలు మాత్రం అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్పనుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగింది.
తాజాగా పవన్ వ్యాఖ్యలపై పుష్పను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన వై రవిశంకర్ స్పందించారు. శ్రీ సింహా హీరోగా ఫరియా అబ్ధుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న మత్తు వదలరా -2 సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ను పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ.. పవన్ తన ఉద్దేశ్యాన్ని వివరిస్తూ ఫ్లోలో అలా మాట్లాడారని రవిశంకర్ పేర్కొన్నారు. ఆయన మాటలను పుష్ప మూవీపై రుద్దుతున్నారని.. పవన్ కళ్యాణ్ స్థాయి వేరని చెప్పారు. అలాగే జనసేన నేతలు బన్నీపై చేసిన కామెంట్స్‌పైనా రవిశంకర్ స్పందించారు. సినిమా చూశాక అంతా ఒకటే అంటారని, ఇలాంటివి ఎంతో మంది విషయంలో చూశామని ఆయన అన్నారు. రవిశంకర్ క్లారిఫికేషన్‌తోనైనా అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు సమసిపోతాయేమో చూడాలి.


Click it and Unblock the Notifications











