వైఎస్ జగన్ పై పుష్ప 2 మేకర్స్ అలా ట్రోల్ చేశారా? మత్తు వదలరా 2 కలెక్షన్లపై నెటిజన్ల కామెంట్స్

గడిచిన కొన్నేళ్లలో ఏపీ వరకు పాలిటిక్స్ కానీ సినిమాలు కానీ ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ని కాంట్రవర్సీ లని అందించాయి అనేది అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ గత సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ తన ఎమ్మెల్యే, మంత్రులు టాలీవుడ్ పట్ల చూపిన వివక్ష కానీ భారీగ టికెట్ రేట్స్ తగ్గించడం వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో కానీ సినిమాలకి కూడా నచ్చినవారికి హైక్ లు ఇచ్చుకోవడం వంటివి చాలానే కాంట్రవర్సీలు నడిచాయి.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాటి అన్నిటినీ మార్చేసిన సంగతి కూడా అంతా చూసారు. ఇక దీనితో పవన్ కళ్యాణ్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ నుంచి చాలా మందే పెద్దలు ఓపెన్ గానే తాము గత ప్రభుత్వంతో ఇక్కట్లు పడ్డామని ఓపెన్ గానే చెప్పారు. ఇలా సినిమా విషయంలో మాత్రం ఇండస్ట్రీ పరంగా చాలా మందికి వై ఎస్ జగన్ అంటే కాస్త అసంతృప్తి నెలకొంది.

pushpa 2 production house trolling ys jagan with number 11

ఇక టైం మారింది కాబట్టి ఈసారి టాలీవుడ్ ఫ్యాన్స్ టైం వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో రెండు చోట్లా ఓడిపోయాడు అని తన అభిమానులే తనకి ఓట్లు వేయలేదు సింగిల్ సీట్ అంటూ చాలానే ట్రోల్స్ పడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏపీలో పవన్ కి 21 సీట్లు వస్తే జగన్ కి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం అనేది పెద్ద విషయంగా మారిపోయింది.

ఇక ఇక్కడ నుంచి జగన్ అండ్ వైసీపీ పై "11" నెంబర్ ట్రోల్స్ గట్టిగా మొదలయ్యాయి. ఇలా పలు షోస్ లో కూడా 11 నెంబర్ తో చాలా మంది గట్టి ట్రోల్స్ చేస్తుండగా లేటెస్ట్ గా భారీ నిర్మాణ సంస్థ పుష్ప, రంగస్థలం, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాజాగా వీరి నుంచి వచ్చిన చిన్న సినిమా "మత్తు వదలరా 2" మంచి హిట్ అయ్యింది.

కాగా ఈ సినిమా రెండు రోజుల్లో 11 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దీనితో వీరు చేసిన పోస్ట్ జగన్ ఫ్యాన్స్ ని ట్రిగ్గర్ చేసింది. "1 + 1 = 11" అంటూ పోస్ట్ చేశారు. దీనితో ఈ నెంబర్ వైరల్ గా మారింది. కాగా ఇది వై ఎస్ జగన్నే టార్గెట్ చేస్తూ పెట్టింది అంటూ దాని కింద నెటిజన్స్ కామెంట్స్ లో నవ్వుకుంటున్నారు. అలాగే ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా ఇతర హీరోల అభిమానులు కూడా ఉన్నారు.

దీనితో ఈ పదకొండు అనే నెంబర్ మాత్రం ఒక ట్రేడ్ మార్క్ లా మారిపోయింది అని చెప్పాలి. మరి మైత్రి మూవీ మేకర్స్ కావాలనే ఇలా వేసారా లేక యాదృచ్చికమా అనేది వారికే తెలియాలి. కాగా ఈ ఇదే బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇంకా షూటింగ్ దశ లోనే ఉండగా వచ్చే ఏడాది సినిమా స్టార్ట్ కానున్నట్టు రూమర్స్ ఉన్నాయి. ఇక మత్తు వదలరా 2 లో సింహా కోడూరి, కమెడియన్ సత్య కీలక పాత్రల్లో నటించగా వచ్చే రితేష్ రానా దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X