పుష్ప 2 హవా మమూలుగా లేదుగా.. అరుదైన జాబితాలో అల్లు అర్జున్,శ్రీ లీల, రష్మిక కు చోటు
Most Popular Celebs List: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారీ అంచనాలను పెంచేసింది. అందుకు తగ్గట్లుగానే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 సంచలనం సృష్టిస్తుంది. విడుదలైన కేవలం ఆరు రోజులలో 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా గతంలోని ఫ్యాన్ ఇండియా సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్ కే కాకుండా ఇందులో నటించిన నటులకు కూడా ఎనలేని పాపులర్టీ దక్కుతోంది. అలా పుష్ప 2 మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..
పుష్ప 2 సినిమా ఇండియా సినిమా హిసర్టీని తిరిగి రాసేలా చేస్తోంది. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అంతా ఇంతా కావు మరీ. బాహుబలి, కేజిఎఫ్, కల్కి, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఈ సినిమా వల్ల కేవలం డైరెక్టర్ సుకుమార్ కే కాకుండా అల్లు అర్జున్, రష్మిక మందాన, శ్రీ లీల కూడా ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వీరి పేర్లు ఫ్యాన్ ఇండియా వైడ్ గా మారుమోగిపోతున్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారగా.. రష్మిక మందాన నేషనల్ క్రష్ గా ఇండియా వైడ్ గా నేషనల్ వైడ్ గా ఎంతోమంది డై హార్ట్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ లో నటించిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల మాస్ స్టెప్పులేసి.. ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా IMDb (www.imdb.com) అత్యంత ప్రజాదారణ పొందిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పుష్ప2 సినిమా నటుల పేర్లు టాప్ పేర్లు టాప్ లో నిలిచాయి అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రఖ్యాత IMDb లిస్ట్ ఆఫ్ ది వీక్ పేరుతో టాప్ 10 మోస్ట్ పాపులారిటీ
సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో యానిమల్ బ్యూటీ బ్యూటీ ట్రిప్తి దిమ్రీ నం.1 గా రికార్డులకెక్కింది. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలువగా, పుష్ప 2లో 'కిస్సిక్' సాంగ్ పాపులార్టీ తో శ్రీ లీల మూడో స్థానంలో.. పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందాన ఐదవ స్థానంలో నిలిచారు.ఈ జాబితాలో పుష్ప సినిమాలో నటించిన ముగ్గురు నటుల పేర్లు ఎక్కడంతో పుష్ప సినిమాకు ఎంత పాపులారిటీ ఉందో అర్థమవుతోంది.
ఇక ఈ జాబితాలో రజనీకాంత్, సాయి పల్లవి, అలియాభట్, దీపికా పదుకొనే, శివ కార్తికేయన్, వామిక గబ్బి వంటి తదితరులు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 2024లో ఐఎండిబి టాప్ టెన్ మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్టర్స్ వీక్లీ ర్యాంకింగ్ జాబితాను ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబి సబ్క్రైబర్ 250 మిలియన్లకు పైగా నెలవారి సందర్శకులను వాస్తవ పేజీ వీక్షణ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
''


Click it and Unblock the Notifications











