Pushpa 2 Trailer: నేషనల్ అనుకొంటిరా.. ఇంటర్నేషనల్.. పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్ ..

Pushpa 2 The Rule Trailer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun )- డైరెక్టర్ సుకుమార్ ( Sukumar)కాంబోలో తెరకెక్కితున్న మూవీ 'పుష్ప 2'. ఈ పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రానున్నది. మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ గ్రాండ్ (Pushpa 2 Trailer )విడుద‌ల అయింది. నవంబర్ 17న ఆదివారం సాయంత్రం 6.03 గంటలకు బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో పుష్ప 2 ట్రైలర్‌ను గ్రాండ్ గా విడుదల చేశారు.

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' లో అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా న‌టించారు. అలాగే.. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మరోసారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేశారు. డీఎస్పీతో పాటు తమన్ నేపథ్య సంగీతం అందించారు.

Pushpa 2 The Rule Trailer Icon star Allu Arjun and Rashmika Mandanna Pushpa 2 The Rule Trailer released

పుష్ప 2 ట్రైలర్‌ విషయానికి వస్తే.. ''ఎవడ్రా వాడు. డబ్బు అంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. వాడోలో తెలియని బాధ ఏంటో ఉంది.'' అంటూ హీరో జగపతి బాబు క్లాస్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ అవుతోంది. పుష్ప 1 కు సంబంధించిన సీన్స్ చూపించారు. పుష్ప 'నామ్ చోటా హై.. లేకిన్ సౌండ్ బహుత్ బడా హై'అంటూ అల్లు అర్జున్ ఎలివేషన్ సీన్స్‌ చూపించారు. 'పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్..' అంటూ బ్యాగ్ రౌండ్ లో హైఎలివేషన్ తో డైలాగ్ వస్తోంది.

'శ్రీవల్లి నా పెళ్లాం.. పెళ్ళాం మాట వెంటే.. ఎలాగా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా' అంటూ అల్లు అర్జున్ డైలాగ్ వస్తుంది. ఇందులో శ్రీవల్లితో రొమాన్స్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఫహాద్‌ ఫాజిల్ మరోసారి భన్వర్ సింగ్ షెఖావత్ క్యారెక్టర్ లో కనిపించారు. ' పార్టీ ఉంది పుష్ప 'అని ఫహాద్‌ ఫాజిల్‌ చెప్పడం ట్రైలర్ లో చూడవచ్చు. జాతర సీన్స్, ఫైటింగ్ చూపించారు.

' నాకు రావాల్సిన పైసా.. అణా అయినా.. అర్థ అయినా.. అది ఏడు కొండల మీదున్నా.. ఏడు సముద్రాల దాటి ఉన్నా .. వెళ్లి తెచ్చుకుంటా అంటూ అల్లు అర్జున్ పవర్‌‌ఫుల్ డైలాగ్‌ చెబుతాడు. అలాగే..'పుష్ప అంటే నేషనల్ అనుకొంటిరా.. ఇంటర్నేషనల్' అంటూ మూవీపై అంచనాల్ని మరింత పెంచేశారు సుకుమార్. ఫైనల్ గా పుష్ప అంటే.. ఫ్లవర్ అనుకొంటివా.. వైల్డ్ ఫైర్..' అంటూ ట్రైలర్ ను ముగించారు.

పుష్ప ట్రైలర్ ఈవెంట్ లో బన్నీ అభిమానులతో పాటు, సినీ లవర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ ను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి చేస్తున్నారు. అయితే.. ఈ ట్రైలర్ తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ , తమిళ్ లో AGS ఎంటర్టైన్మెంట్స్ , హిందీ లో T- సిరీస్ యూట్యూబ్ ఛానల్, మలయాళం లో e4 ఎంటర్టైన్మెంట్స్ , కన్నడ లో అల్లు అర్జున్ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశాయి.

Pushpa 2 The Rule Trailer Icon star Allu Arjun and Rashmika Mandanna Pushpa 2 The Rule Trailer released

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ లు నిర్మిస్తున్నారు. పుష్ప పార్ట్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో రెండో పార్ట్ కోసం భారీ మొత్తం లోబడ్జెట్ కేటాయించారు. దాదాపు 500 కోట్లు అయినట్టు ఇండస్ట్రీ టాక్. ఫ్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల పైగా జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బన్నీకి 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X