Pushpa 2 Japan Release: జపాన్‌లో పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. టోక్యోలో అల్లు అర్జున్ ఫ్యామిలీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ భండారీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం పుష్ప 2. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప 2. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. డిసెంబర్ 5వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో కలెక్షన్లను రాబట్టింది. పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజులపాటు వరల్డ్ బాక్సాఫీస్‌ను పుష్ప రాజ్ కలెక్షన్లతో శాసించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది. ఈ సినిమా జపాన్ రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Pushpa 2 to release in Japan

ఐకాన్ స్టార్‌కు జపాన్‌లో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా జపాన్ భాషలో ప్రమోలు, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా రెస్పాన్స్ వస్తున్నది. దాంతో ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ కూడా నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక పుష్ప 2 చిత్రాన్ని జపాన్ భాషలో పుష్ప కన్రీన్ అనే పేరుతో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో జపాన్‌ డిస్ట్రిబ్యూటర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చరిత్రను తిరగరాసిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం ఫుల్ ఫోర్స్‌తో జపాన్‌లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను సుమారుగా 250 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇంకా థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా సరిహద్దులు, సముద్రాలు దాటి ఈ సినిమా జనవరి 16వ తేదీన జపాన్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఇక వైల్డ్ ఫైర్ జపాన్‌ను చుట్టుముడుతుంది. పుష్ప రాజ్ మ్యాజిక్ కోసం జపాన్ వాసులారా సిద్దం కండి అంటూ పోస్టులో సందేశాన్ని ఉంచారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో టోక్యో చేరుకొన్నారు. ఆయన సతీమణి స్నేహారెడ్డి, అల్లు అర్హ, కుమారుడు కలిసి వెకేషన్ కోసం జపాన్‌కు చేరుకొన్నారు. ఈ టూర్‌లో పుష్ప 2 కోసం నిర్వహించే మీడియా సమావేశంలో అల్లు అర్జున్ పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి ముంబై చేరుకొన్న ఆయన నేరుగా జపాన్‌ పర్యటనకు వెళ్లారు.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun Pushpa Kunrin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X