Pushpa 2 Trailer: పుష్ప 2 ట్రైలర్ లాంచ్‌కు బడా పొలిటికల్ లీడర్స్, నార్త్ యాక్టర్లు.. ఎవరెవరు వస్తున్నారంటే?

పుష్న ది రూల్ (Pushpa The Rule) మూవీని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు కనీవినీ ఎరుగని రీతిలోప్రమోషన్స్‌కు తెర లేపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ వివరాలు, అల్లు అర్జున్, రష్మిక మందన్న తదితర యూనిట్ సభ్యులు ప్లానింగ్ విశేషాల్లోకి వెళితే..

పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన పాట్నా, కోల్‌కతా, చెన్నై, కోచి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాల్లో భారీగా నిర్వహించనున్నారు. ప్రతీ నగరంలో ఓ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లానింగ్ చేశారు. నవంబర్ నెల మొత్తం టీమ్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేలా ప్లాన్ చేశారు.

Pushpa 2 Trailer Release Event Guest List Bihar Political Leaders and Bhojpuri star Actors

అయితే దేశవ్యాప్తంగా చేసే పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌కు భారీగా బడ్జెట్ కేటాయించారు. ఈ మొత్తం ప్రమోషన్స్ కోసం సుమారుగా 150 కోట్ల రూపాయలను కేటాయించినట్టు మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఇటీవల కాలంలో RRR సినిమా ఆస్కార్ లాబీయింగ్ కోసం ఖర్చు చేసిన మొత్తం కంటే ఇది ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా, నవంబర్ 17వ తేదీన పాట్నాలో నిర్వహించే ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం గత వారం రోజులుగా వేదిక నిర్మాణం, బారికేడ్లు నిర్మిస్తున్నారు. ఈవెంట్ కోసం కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని స్థానికులు తెలిపారు.

Pushpa 2 Trailer Release Event Guest List Bihar Political Leaders and Bhojpuri star Actors

పుష్ప 2 మూవీ కోసం ఊహించని విధంగా అంచనాలకు మించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్ కోసం భోజ్‌పురి సినీ నటులు, స్థానిక కళాకారులు, అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. అయితే పొలిటికల్ లీడర్స్ వస్తున్నందన స్థానిక పోలీసులతోపాటు భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ వస్తున్నది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల్లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలోని సన్నివేశాలను నభూతో నభవిష్యత్ అనే విధంగా తెరకెక్కించారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ కానున్నది. పెయిడ్ ప్రీమియర్లన డిసెంబర్ 4వ తేదీన ప్రదర్శించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X