Pushpa 3: "పుష్ప 3" కన్ఫర్మ్ .. టైటిల్ ఏంటో తెలుసా? ఏనాడో చెప్పేసిన రౌడీ హీరో
చాలా కాలం తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ అంతా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న అవైటెడ్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఒక బాహుబలి 1, KGF చాప్టర్ 1 లలో చూపించే ఎగ్జైటింగ్ క్లైమాక్స్ లేనప్పటికీ ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాల సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్న రేంజ్ లో పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ బిగ్గెస్ట్ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించగా తనకి లైఫ్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా రిలీజ్ కి ముందే పాన్ ఇండియా లెవెల్లో ఏకంగా 1000 కోట్ల బిజినెస్ లు టచ్ చేసిన సినిమాగా కూడా ఇదే నిలిచింది. ఇలా చాలా రకాలుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

కాగా ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ పర్వం ఎప్పటి నుంచో ఉంది. కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం పార్ట్ 2 వరకే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నాయి. హిందీలో పార్ట్ 3ల వరకు ఉన్నాయి. కానీ మన సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో పార్ట్ 3 మాత్రం ఇంకా ఏ సినిమా నుంచి అఫీషియల్ గా ప్రకటించింది లేదు. కానీ పుష్ప కి మాత్రం ఇంకా పార్ట్ 2 స్టార్ట్ కాకుండానే అప్పుడెప్పుడో లాక్ డౌన్ సమయంలో మలయాళ నటుడు ఈ సినిమాను భన్వర్ సింగ్ షెకావత్ రివీల్ చేయడం జరిగింది.
అక్కడి నుంచి పార్ట్ 3 ఉంటుందని చాలానే మాటలు డైరెక్ట్‌గా చిత్ర యూనిట్ నుంచే మొదలైంది. మొన్ననే నేషనల్ క్రష్, పుష్ప గాడి లవ్ శ్రీవల్లి కూడా పార్ట్ 3 ఉందని ప్రస్తావించింది. ఇలా పార్ట్ 3 విషయంలో ఎప్పటికపుడు ఏదొక వార్త వినిపిస్తూ వస్తున్న తరుణంలో ఇపుడు డైరెక్ట్ గా పుష్ప పార్ట్ 3 టైటిల్ లీక్ అయ్యిపోయింది. మేకర్స్ పుష్ప పార్ట్ 1 కి పుష్ప ది రైజ్, పార్ట్ 2 కి ది రూల్ అని తీసుకొస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా మూడో భాగానికి అయితే "పుష్ప 3 ది ర్యాంపేజ్" అనే క్రేజీ టైటిల్ ని ఇపుడు లాక్ చేసినట్టుగా లీక్ అయ్యింది. మరి ఇదెలా లీక్ అయ్యింది అంటే ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న ప్రముఖ సౌండ్ డిజైనర్ రేసుల్ పూకుట్టి తాను వర్క్ చేసిన స్టూడియో నుంచి పని పూర్తయ్యిన తర్వాత పుష్ప 1 కి ఎండ్ కార్డ్ లో పుష్ప 2 ఎలా చూపించారో ఇపుడు పుష్ప 2 ఎండ్ కార్డ్ లో పుష్ప 3 టైటిల్ కార్డు కూడా కనిపిస్తుంది.
రేసుల్ వెనుక సరిగ్గా గమనిస్తే "పుష్ప 3 ది ర్యాంపేజ్" అని క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో పుష్ప 3 టైటిల్ ఏంటి అనేది లీక్ అయ్యిపోయింది అని చెప్పాలి. అలాగే దీనితో పాటుగా పుష్ప 3 కూడా ఉందని అధికారికంగా కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇది కాకుండా పుష్ప పార్ట్ 3 టైటిల్ ని మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో కూడా ఎప్పుడో గెస్ చేసేసాడు. మరి ఆ హీరో ఎవరో కాదు మన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండనే. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన ఓ పాత పోస్ట్ కూడా ఇపుడు వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











