For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రోడ్డు పక్కన గుడిసెలో అల్లు అర్జున్.. ఆకలికి తట్టుకోలేక సడన్ సర్‌ప్రైజ్‌

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో అవసరం లేనప్పుడు అంతే సింప్లిసిటీతో ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఒకసారి సినిమాను మొదలుపెడితే పూర్తిగా కొత్తగా ట్రై చేయాలని అడుగులు వేస్తూ ఉంటాడు. సినిమా కోసం తనని తాను ఎలాగైనా సరే మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. 100 పర్సెంట్ తన కష్టాన్ని పెట్టేందుకు సిద్ధపడతాడు. స్టైల్ విషయంలో డాన్స్ విషయంలో అలాగే యాక్షన్ అయినా సరే ప్రాణం పెట్టి వర్క్ చేస్తాడు. అందుకే అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్ అని అంటుంటారు.

  Allu Arjun Eats At A Roadside Hotel In Kakinada, Video Goes Viral || Filmibeat Telugu

  అతనితో వర్క్ చేసిన దర్శకులు అందరు కూడా మరొకసారి ఇంకా మంచి సినిమా చేయాలని అనుకుంటారు. అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ గా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అనేది చాలా తక్కువమందికి తెలుసు. ఇక ఇటీవల ఆకలికి తట్టుకోలేక అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  బన్నీ కష్టానికి తగ్గ ఫలితం

  బన్నీ కష్టానికి తగ్గ ఫలితం

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గత రెండేళ్లుగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీసు వద్ద తన కంటూ ఒక పాన్ ఇండియన్ మార్కెట్ సెట్ చేసుకోవాలని అడుగులు వేస్తున్నాడు.

  సినిమా రిజల్ట్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు కానీ బన్నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుందని ఇదివరకే సుకుమార్ ఒక క్లారిటీ ఇచ్చాడు. అలాగే అతనికి ఐకాన్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే ప్రమోషన్ లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పవర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. మొదటి సాంగ్ తోనే సోషల్ మీడియాలో సరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. తప్పకుండా పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగా సినిమా ఉంటుందని అభిమానులు కూడా సంబరపడిపోయారు.

  ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..

  అలాంటి జీవితానికి దూరంగా..

  అలాంటి జీవితానికి దూరంగా..

  పుష్ప సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టర్ తో పాటు జనాలకు దగ్గరయ్యేలా చేస్తోంది. దర్శకుడు సుకుమార్ తన కెరీర్ లో మొదటి సారి ఒక పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ కు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని సినిమా ఇండస్ట్రీలలో అంచనాల స్థాయి పెరిగిపోయింది.

  తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఎక్కువగా అడవులలోనే ఈ సినిమా షూటింగ్ ను కొనసాగించారు. అల్లు అర్జున్ కూడా ఆ వాతావరణానికి తగ్గట్లుగానే స్టైలిష్ లైఫ్ కు కాస్త దూరంగా పెట్టుకున్నాడు. ఒక విధంగా పుష్ప రాజ్ అనే క్యారెక్టర్ లో జీవించేశాడు అనే అంటున్నారు.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  గుడిసెలో నుంచి బయటకు వచ్చిన బన్నీ

  ఆ విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ బయటకు కాస్ట్లి లైఫ్ ను ఎంజాయ్ ఎలా చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే అప్పుడప్పుడు ఈ హీరో సింపుల్ లైఫ్ ను కూడా ఇష్టపడతాడు. తన ఇంట్లో కూడా పిల్లలతో గడిపేటప్పుడు తన స్టైలిష్ గా కాకుండా పూర్తిగా ఒక సాధారణం తండ్రి తరహాలోనే పిల్లలను ఆడిస్తూ ఉంటాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక గుడిసెలోకి వెళ్లి వచ్చిన వీడియో వైరల్ గా మారింది. అక్కడికి అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నలు చాలానే వచ్చాయి. ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ అవడంతో అనేక రకాల కథనాలు కూడా వెలువడుతున్నాయి

  హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: అదిరిపోయే ఫోజులతో అందాల విందు

   రోడ్డు పక్కన టిఫిన్

  రోడ్డు పక్కన టిఫిన్

  అసలు మ్యాటర్ లోకి వెళితే.. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో పుష్ప షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ లో మాత్రం గ్యాప్ వచ్చినా కూడా బన్నీ అలా ట్రావెల్ చేస్తూ వస్తున్నాడట. అంతే కాకుండా తనకు ఇష్టమైన రుచికరమైన వంటలను ప్రత్యేకంగా చేయించుకుంటాడు. అయితే ఇటీవల ఎం జరిగిందో ఏమో కానీ అల్లు అర్జున్ షూటింగ్ లోకేషన్ నుంచి బయటకు వచ్చి ఒక చిన్న కాకా హోటల్లో దర్శనమివ్వడం అందరిని షాక్ కు గురి చేసింది.

  గోకవరం ప్రాంతంలో రోడ్డు పక్కన టిఫిన్ చేసి అందులో నుంచి బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇష్టంగా నేచురల్ ఫుడ్ ను ఎంజాయ్ చేసిన బన్నీ బయటకు వస్తుండగా హోటల్ యజమానికి అలాగే అక్కడ పనిచేసే వ్యక్తికి కూడా ప్రత్యేకంగా టిప్ కూడా ఇచ్చాడు.

  ఎవరు గుర్తు పట్టలేదు?

  ఎవరు గుర్తు పట్టలేదు?

  అసలు అక్కడికి అల్లు అర్జున్ ఎందుకు వస్తాడు అని మొదట జనాలు ఎవరూ ఊహించలేదు. టిఫిన్ కోసం అల్లుఅర్జున్ ఒక కాకా హోటల్ కు ఎందుకు వస్తారు అని అనుకున్నారో ఏమో గానీ కొద్దిసేపటి వరకు అందరూ గుర్తే పట్టలేదు. ఇక అతను బన్నీ అని తెలిశాక అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలాంటి భోజనం అయినా సరే తన దగ్గరికి తెప్పించుకుని తినగలిగే బన్నీ ఇలా బయటకు వచ్చి టిఫిన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అల్లు అర్జున్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి సరదాగా అలా బయటకు వచ్చి భోజనం చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

  English summary
  Pushpa actor Allu arjun eats at a normal road side hotel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X