Pushpa: సమంత పాటపై కేసు నమోదు.. చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిటీషన్.. ఎవరు వేశారో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో 'పుష్ప' ఒకటి. దీనికి కారణం ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి చేస్తుండడమే. దీనికితోడు ఇది పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. అందుకే ఈ సినిమా నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక, ఈ సినిమా నుంచి రెండు రోజుల క్రితమే 'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' అంటూ సాగే ఓ స్పెషల్ నెంబర్ విడుదలైంది. సమంత డ్యాన్స్ చేసిన ఈ పాట దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ రికార్డు స్థాయిలో రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ పాటపై కేసు నమోదైంది. కొందరు దీన్ని నిషేదించాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఆ వివరాలు మీకోసం!

‘పుష్ప'గా వచ్చేస్తున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. సునీల్, అనసూయ ఇందులో కీలక పాత్రలు చేయగా.. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసింది.

ఊ అంటావా... ఊఉ అంటావా సాంగ్
'పుష్ప' మూవీ నుంచి ఏ సాంగ్ వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఈ క్రమంలోనే దీని నుంచి తాజాగా 'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' అంటూ సాంగే స్పెషల్ సాంగ్‌ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక, ఈ పాటలో స్టార్ హీరోయిన్ సమంత కనిపించి మెప్పించింది.

రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప పాట
'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' పాటకు అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగులో దీనికి రికార్డు స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా 24 గంటల్లోనే ఈ పాట 12.39 మిలియన్ వ్యూస్‌ను, 634K లైకులను సొంతం చేసుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. దీంతో ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

సమంత పాటపై ఏపీలో కేసు నమోదు
'పుష్ప ద రైజ్' నుంచి పార్టీ సాంగ్‌గా వచ్చిన 'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. దీంతో ఇది సెన్సేషన్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాటపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు అయినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో పుష్ప మూవీ వివాదంలో చిక్కుకుంది.

చర్యలు తీసుకోవాలంటూ పిటీషన్
'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' పాటలో మగవాళ్ల వ్యక్తిత్వాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయని.. దీన్ని వెంటనే నిషేదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 'పురుష సంఘం' సభ్యులు ఓ పోలీస్ స్టేషన్‌లో చిత్ర యూనిట్‌పై కేసు పెట్టిందట. అంతేకాదు, దీన్ని రద్దు చేయడంతో పాటు చర్చలు తీసుకోవాలని కోర్టుకు కూడా వెళ్లినట్లు న్యూస్ వైరల్ అవుతోంది.
Recommended Video

చిత్ర యూనిట్ స్పందించనే లేదు
'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా మావ' పాటపై కేసు నమోదు అయిందన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు. అలాగే, మేమే ఫిర్యాదు చేశాం అంటూ పురుష సంఘానికి చెందిన వాళ్లు కూడా బయటకు రాలేదు. దీంతో ఇదో గాలి వార్త అయి ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











