Allu Arjun ఫ్యాన్స్‌కు చేదువార్త.. బాలీవుడ్‌లో మూవీ రిలీజ్ వాయిదా
దక్షిణాది సినిమా పరిశ్రమకే పరిమితమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప హిందీ వెర్షన్‌తో ఉత్తరాది ప్రేక్షకులను కూడా తన అభిమానులను చేసుకొన్నారు. ఎలాంటి ప్రమోషన్స్, అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప చిత్రం హిందీ వెర్షన్ 90 కోట్లకుపైగానే కలెక్షన్లను రాబట్టింది. దాంతో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో స్పష్టమైంది.

పుష్ప చిత్రాన్ని అన్ని భాషల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయినా పుష్ప హిందీ వెర్షన్ థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నది. దాంతో అల్లు అర్జున్ క్రేజ్‌ను క్యాష్ చేసేందుకు గతేడాది అల వైకుంఠపురంలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే ఇలాంటి సమయంలో అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్‌ను రిలీజ్ చేయాలని డిసైడ్ కావడం తప్పుడు నిర్ణయం అనే వాదన వినిపించింది. దాంతో సినిమా రిలీజ్‌కు ముందు అలా వైకుంఠపురంలో విడుదలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
తెలుగులో ఘన విజయం సాధించిన అల వైకుంఠపురం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆర్యన్ కార్తీక్ హీరోగా షెహజాదే చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఈ క్రమంలో పుష్ప హిందీలో విజయవంతమైన తర్వాత అల వైకుంఠపురంలో సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని భావించారు. అయితే షెహజాదే సినిమాకు ముందు అలావైకుంఠపురంలో హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. హిందీలో రిలీజ్ చేయాలని సిద్ధమైన గోల్డ్‌మైన్స్ కంపెనీ ప్రమోటర్ మనీష్ షా చర్చించారు. దాంతో అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ చిత్రం విడుదలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దాంతో మనీష్ షాకు థ్యాంక్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications











