మహిళను వేధించిన కేసులో పుష్ప నటుడు అరెస్ట్.. ఎవరో కాదు అల్లు అర్జున్ స్నేహితుడే!

పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. ఈ సినిమాతో అటు సుకుమార్ కూ మంచి పేరే వచ్చింది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు జగదీష్. జగదీష్ అంటే పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. పుష్ప రైట్ హ్యాండ్ కేశవ అని చెబితే అందరూ గుర్తుపట్టేస్తారు.

పుష్ప సినిమాకు ముందు కూడా బండారు జగదీష్ అలియాస్ పుష్ప కేశవ పలు సినిమాల్లో నటించాడు, సిరీస్ లు, యూట్యూబ్ వీడియోల్లోనూ జగదీష్ కనిపించాడు. కానీ, పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు. కానీ పుష్ప సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయడంతో ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. పుష్ప ది రైజ్ విడుదలైన సమయంలో జగదీష్ గురించి చాలా మంది స్పందించారు. చాలా బాగా చేశాడని, మంచి ఫ్యూచర్ ఉందని, ఇలాంటి విభిన్న తరహా పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలడని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఎంతో ఫ్యూచర్ ఉంది అనుకున్న సమయంలోనే.. జగదీష్ ఇప్పుడు ఓ కేసులో అరెస్టు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 Pushpa Movie Actor Jagadish Arrested For Harrasing Woman Check Details

ఓ లేడీ జూనియర్ ఆర్టిస్టు మృతి కేసులో పోలీసులు జగదీష్ ను అరెస్టు చేశారు. ఓ లేడీ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉండగా జగదీష్ ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళపై బెదిరింపులకు పాల్పడిన జగదీష్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జగదీష్ వేధింపులు భరించలేక పంజాగుట్ట పరిధిలో నివాసం ఉండే ఆ మహిళా జూనియర్ ఆర్టిస్టు నవంబర్ 29వ తేదీన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి బండారు జగదీష్ పరారీలో ఉండగా.. తాజాగా పోలీసులు పట్టుకున్నారు. జగదీష్ కెరీర్ మొదట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చేశాడు. ఆ సమయంలోనే జగదీష్ కు ఆ మహిళకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందని సమాచారం.

ఆ తర్వాత జగదీష్ కు సినిమాల్లో అవకాశాలు రావడం.. మెల్లిమెల్లిగా బిజీగా కావడం మొదలు అయింది. ముఖ్యంగా 2019 నుంచి ఆయన మరింత బిజీగా మారిపోయారు. మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస 1978, పుష్ప, పిక్ పాకెట్ , విరాట పర్వం, వాంటెడ్ పండుగాడు, వంటి చిత్రాల్లో కనిపించాడు. ముఖ్యంగా పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం అందులో అల్లు అర్జున్ స్నేహితుడిగా చేసిన జగదీష్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X