పుష్ప కోసం సాంగ్స్ సిద్ధం చేసిన రాక్ స్టార్.. కానీ ఆ ఒక్క పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా పుష్పా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. షూటింగ్ లో మళ్ళీ స్పీడ్ పెంచాలని దర్శకుడు సుకుమార్ ప్రణాళికలు బాగానే రచించాడు గాని వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అల్లు అర్జున్ కూడా సుక్కు ఎప్పుడు పిలిచినా రెడీగా ఉండాలని పుష్ప కోసం సెట్ చేసుకున్న లుక్కును ఏ మాత్రం మార్చడం లేదు.
ఒకే రకమైన ఫైట్ నెస్ ని నెలల తరబడి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. కానీ బన్నీ ఏకాగ్రతతో డైట్ మెయింటైన్ చేస్తూ హెయిట్ స్టైల్ ని కూడా మార్చడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేయడానికి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రెడీగా ఉన్నట్లు టాక్ వస్తోంది. వీలైనంత వరకు అన్ని పాటలను రేడి చేయమని సుక్కు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆల్ మోస్ట్ అన్ని పాటలను సెట్ చేసుకున్నాడట.

సుకుమార్ సినిమా అనగానే ఒక ఐటెమ్ సాంగ్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆ పాట కోసం మాత్రం దేవిని సుకుమార్ గట్టిగానే ఇబ్బంది పెడుతున్నాడట. ఆ ఒక్క ట్యూన్ కి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. ఇక షూటింగ్ ని నెక్స్ట్ వికారాబాద్ ఫారెస్ట్ లలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సుకుమార్ బన్నీ కాంబినేషన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











