Pushpa Leaks : సీమ యాసలో రచ్చ రేపే డైలాగ్ లీక్.. యూనిట్లో టెన్షన్!
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ముందు నుంచి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ సినిమాకి లీకేజీలు మాత్రం ఆగడం లేదు. తాజా లీకేజీలు సినిమాకు టెన్షన్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

అది పూర్తి కాగానే మొదలు
చివరిగా అల వైకుంఠపురం సినిమాలో ప్రజలు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో పోటీపడి సంక్రాంతి రేసులో ఆ సినిమా కి గట్టి పోటీ ఇచ్చింది. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా ప్రారంభించాడు.

భారీ అంచనాలు
సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకు నటించినటువంటి రీతిలో ఈ సినిమాలో నటించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు.

మాఫియ డాన్
ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. లారీ డ్రైవర్ రేంజ్ నుంచి ఆయన ఒక మాఫియా డాన్ రేంజ్ కి ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో కూడా సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా మొత్తం మీద ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఐదు భాషల్లో సినిమా యూనిట్ ప్రచారం చేస్తూ వస్తోంది.

కాకినాడలో షూటింగ్
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ కాకినాడ పోర్టులో అల్లు అర్జున్‌పై యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. అక్కడి వీడియో లీకయినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా లీకైన వీడియోలో ఉన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "పుష్ప" సెట్స్ నుండి అల్లు అర్జున్ చెప్పిన రాయల సీమ యాస డైలాగ్ వైరల్ అవుతోంది.

డైలాగ్ లీక్
ఈ వీడియోలో అల్లు అర్జున్ 'ఇంతకు ముందో టూ వీలర్ స్కూటర్ మాట్లాడుల్లా. నేనో యాపారం చేసే దానికి తిరుపతి నుంచి వచ్చుందాం' అనే డైలాగ్ చెప్పడం ఉంది అని అంటున్నారు. డైలాగ్ లీకైనందుకు యూనిట్ లో టెన్షన్ నెలకొంది.ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక క్రిస్మస్ కి విడుదల చేస్తామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది కానీ తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











