Pushpa OTT: ఓటీటీ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్ చేసుకున్న పుష్ప.. ఆ ఒక్క భాషలో తప్పితే..
గత ఏడాది అత్యధిక స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా పుష్ప సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకొని తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేసింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా అల్లు అర్జున్ కు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న పుష్ప ఓటీటీ లోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చని అందరూ అనుకున్నారు. ఇక ఓటీటీ విడుదలపై కూడా అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చేసింది.

డిఫరెంట్ మాస్ లుక్..
ఆర్య, ఆర్య 2 సినిమా లో అనంతరం దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తో మరో లవ్ స్టోరీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పుష్ప అనే ఊర మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలో అల్లుఅర్జున్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక డిఫరెంట్ మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

హిందీలో సాలీడ్ వసూళ్లు
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమా హిందీలో కూడా భారీ స్థాయిలో గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. మొదటి రోజు కంటే కూడా 15వ రోజు ఎక్కువగా 6 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యకరం. హిందీలో ఆ స్థాయిలో వసూళ్లు అందుతాయని ఎవరు ఊహించలేదు.

పోటీ లేకపోవడంతో..
బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్ కెరీర్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసిన పుష్ప పవర్ఫుల్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. భవిష్యత్తులో వీరు చేయబోయే ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీలో అయితే ఈ సినిమా 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.. పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.

అమెజాన్ డేట్ ఫిక్స్.. ఆ భాషలో తప్పితే..
అయితే ఇప్పుడు సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ క్లారిటీ అయితే ఇచ్చేసింది. సినిమాను జనవరి 7వ తేదీన తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ భాషలో కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. అయితే హిందీ విడుదల పై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Recommended Video

టైమ్ ఫిక్స్..
జనవరి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రాత్రి 8 గంటల నుంచి పుష్ప సందడి చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. అయితే సినిమా మరి కొన్ని రోజులు థియేటర్స్ లో కొనసాగితే బాగుండేది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం చిత్ర యూనిట్ సభ్యులు అమెజాన్ ప్రైమ్ లోనే సినిమాను విడుదల చేయక తప్పడం లేదు


Click it and Unblock the Notifications











