రంగస్థలంలో చెర్రీకి అలా.. పుష్ఫలో బన్నీకి ఇలా..సుకుమార్‌ సెంటిమెంట్‌కు తగినట్టే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీతో మంచి జోష్ మీద ఉన్నారు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లను నమోదు చేసుకొని మరో సినిమాపై దృష్టిపెట్టారు. ఇలాంటి శుభ పరిణామాల మధ్య స్టైలిష్ స్టార్ బర్త్ డేను ఘనంగా జరుపుకొంటున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా దర్శకుడు సుకుమార్ తన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే అందులో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం చెప్పకనే బయటపెట్టారు. అదేమిటంటే..

పుష్పకుమార్‌గా అల్లు అర్జున్

పుష్పకుమార్‌గా అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ విభిన్నమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. బన్నీ జన్మదినం సందర్బంగా ఐదు భాషల్లో టైటిల్ పోస్టర్‌ను సుకుమార్ రిలీజ్ చేశారు. తెలుగులో పుష్ఫగా సినిమా టైటిల్‌ను పెట్టారు. ఇతర భాషల్లో టైటిల్స్‌ను പുഷ്പ, புஷ்பா, ಪುಷ್ಪ, पुष्पा సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పేరు పుష్ప కుమార్ అని వెల్లడించారు.

పోస్టర్‌లో బన్నీకి ఆరో వేలు

పోస్టర్‌లో బన్నీకి ఆరో వేలు

పుష్ప పోస్టర్‌లో అల్లు అర్జున్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అంశం బయటపడింది. స్టైలిష్ స్టార్ కాలుకు ఆరు వేలు ఉండటం గమనార్హం. అయితే కథలో ఆరు వేళ్లకు ఏదో బలమైన పాయింట్ ఉంటుందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తన సెంటిమెంట్ ప్రకారం హీరోకు శారీరకంగా ఏదో లోపాన్ని కొనసాగిస్తున్నారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

అంగవైకల్యం సెంటిమెంట్

అంగవైకల్యం సెంటిమెంట్

సుకుమార్ గత చిత్రం రంగస్థలం రికార్డు విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఆ చిత్రంలో హీరో రాంచరణ్‌కు అంగవైకల్యం ఉంటుందనే విషయం తెలిసిందే. చెవిటి వాడిగా చూపించి ప్రేక్షకులను మెప్పించారు సుకుమార్. తాజాగా ఇప్పుడు బన్నీకి ఇలా కాలికి ఆరు వేళ్లు పెట్టించాడా? లేక సహజంగానే అల్లు అర్జున్‌కు ఉన్నాయా అనేది తేలాల్సిన విషయంగా మారింది. అయితే బన్నీకి సహజంగానే కాలికి ఆరు వేళ్లు ఉంటాయని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. తాజాగా పుష్ప పోస్టర్ కారణంగా ఈ విషయం బయటకు వచ్చింది.

Recommended Video

#HappyBirthdayAlluArjun: Allu Arjun Special Gift To Fans
ఎర్రచందనం మాఫియా నేపథ్యంగా

ఎర్రచందనం మాఫియా నేపథ్యంగా

ఇక పుష్ప చిత్రంలో రొటీన్‌కు భిన్నంగా బన్నీ కనిపించబోతున్నాడు. చిత్తూరులో అక్రమ కలప వ్యాపారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నదనేది తాజా సమాచారం. ఈ చిత్రంలో ఎర్ర చందనం మాఫియా కథా నేపథ్యంగా సాగుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కొంత వాయిదా పడింది. ఒకసారి ఈ సమస్య నుంచి బయటపడితే శరవేగంగా సినిమాను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X