Pushpa Movie: రష్యన్ ట్రైలర్ వచ్చేసింది.. డబ్బింగ్ కూడా ఆదిరిందిగా..
ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ స్థాయిని మరో లెవెల్ కు పెంచిన పుష్ప పార్ట్ వన్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పుష్ప సినిమాను నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సినిమాకు సంగీతం అందించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాను వివిధ దేశాల్లో కూడా విడుదల చేయాలి అని ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఇప్పుడు రష్యాలో కూడా ఈ సినిమాను అక్కడి స్థానిక భాషల్లో విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఇక రష్యా భాషలో ఈ సినిమాను పూర్తిస్థాయిలో డబ్ చేసి మరి విడుదల చేస్తున్నారు. ఇక మొత్తానికి పుష్ప సినిమా రష్యా ట్రైలర్ కూడా విడుదల చేయడం విశేషం. రష్యన్ లాంగ్వేజ్ లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ తో పాటు ఇతరుల డైలాగ్స్ కూడా డబ్బింగ్ కు తగ్గట్టుగా కరెక్ట్ గా సెట్ అయ్యాయి అనిపిస్తుంది.

పూర్తిగా విభిన్నమైన మాస్ నేటివిటీతో ఉన్న ఈ సినిమాను రష్యా ఆడియన్స్ కూడా చూడాలని అనుకుంటున్నారు
ముందుగానే కొన్ని ఫిలిమ్ ఫెస్టివల్స్ లో పుష్ప సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఏకంగా రష్యన్ లాంగ్వేజ్లో అక్కడ ప్రమోట్ చేసి మరి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమాను రష్యాలో మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత రెవెన్యూని బట్టి మరికొన్ని ఎక్కువ థియేటర్ల సంఖ్యను పెంచాలని అనుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా అక్కడ సినిమాను ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అల్లు అర్జున్ మెల్లగా తన స్థాయిని దేశ విదేశాల్లో కూడా పెంచుకోవాలని బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమా రష్యా భాషలో ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











