Pushpa: ఆ రెండు పాత్రలపై పెదవి విరిస్తున్న ప్రేక్షకులు.. వాల్లని ఎంచుకోవడమే తప్పా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప మూవీ మొత్తానికి నేడు గ్రాండ్ గా విడుదల అవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఓ వర్గం ప్రేక్షకులలో అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇక మొత్తానికి శుక్రవారం ఉదయం నుంచే నైజాంలో ఫ్యాన్స్ షోలతో పలు థియేటర్స్ లలో ప్రత్యేక సందడి నెలకొంది. ఇక ఓవర్సీస్ లో కూడా అభిమానులు ప్రీమియర్ షోలను చూసేశారు. అయితే సినిమాను చూసిన వారు సినిమాలోని రెండు పాత్రలపై పెదవి విరుస్తున్నారు.
Recommended Video

వారి నుంచి పాజిటివ్ టాక్
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతోంది. ఇక మొదటి భాగం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా ఉదయం నుంచే అభిమానుల్లో ప్రత్యేక సందడి నెలకొంది. పలు ఏరియాల్లో నిర్మాతలు ప్రత్యేకంగా అభిమానుల కోసం షోలను ప్రదర్శించారు. ఇక విడుదలైన మొదటి రోజే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తోంది. పుష్ప రాజ్ గా బన్నీ ఇరగదీసాడు అంటున్నారు.

పుష్పరాజ్ సుపర్బ్
ఫస్ట్ హాఫ్ హీరోయిజం ఎలివేషన్, మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా దర్శకుడు ఎక్కువగా కథపైనే ఫోకస్ పెట్టడం బావుందంటున్నారు. ఇక పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్, అతని ఫ్రెండ్ నుంచి వచ్చే అపాయం సినిమాను మేజర్ ప్లస్ పాయింట్స్ అని తెలుస్తోంది. ఇక 'ఊ అంటావా' సాంగ్ కూడా మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని సమాచారం..

చప్పగా సాగిందని..
ఇక సాదారణ ప్రేక్షకులైతే పుష్పా అంచనాలకు తగ్గట్టుగా లేదని ఒక 'కూలీ' నుంచి 'సిండికేట్ బాస్'గా ఎదిగిన చందనం స్మగ్లర్ కథ చప్పగా సాగిందని అంటున్నారు. కానీ అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ ప్రత్యేకంగా నిలిచాయట. ముఖ్యంగా సెకండాఫ్ ఎక్కువగా నిరాశపరిచిందని చివరి 30 నిమిషాలు మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉండదని టాక్ వస్తోంది.

ఆ పాత్ర ఇంకా ఉంటే..
ఇక పార్ట్ 1లో మలయాళం టాలెంటెడ్ యాక్టర్ ఫహద్‌కి ఎలాంటి ప్రాముఖ్యత లేదట. ఆ విషయంలో దర్శకుడు ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. అతని క్యారెక్టర్ ఎక్కువగా సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని వివరణ ఇచ్చారు. కానీ ఓ వర్గం అభిమానులు అతని పాత్ర ఇంకా ఎక్కువగా ఉంటే బావుంటుందని ఆలోచిస్తారని చెప్పవచ్చు.

సునీల్ పాత్ర విషయంలో..
అయితే మరొక రెండు క్యారెక్టర్స్ విషయంలో అభిమానులు పెంచుకున్న అంచనాలకు సుకుమార్ చేరువయ్యేలా డిజైన్ చేయలేదని టాక్ వస్తోంది. ముఖ్యంగా సునీల్ పాత్ర అనుకున్నంతగా ఏమి మెప్పించలేదట. బిగ్ బాస్ గా నెగిటివ్ రోల్ లో మంగళం శీనుగా సునీల్ కనిపిస్తాడు. అయితే సునీల్ ని కొత్తగా చూడాలి అనిపించే ఆలోచన కూడా రాదని క్యారెక్టర్ ను అనుకున్నంతగా డిజైన్ చేయలేదని చెబుతున్నారు.

మరోసారి రష్మిక అలాంటి పాత్రలోనే..
ఇక రష్మీక మందన్న మరోసారి ఓవరాక్షన్ చేసినట్లుగా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె చేసిన పాత్ర తరహాలోనే ఇందులో కూడా అలాంటి పెర్ఫెమెన్స్ ఇచ్చినట్లు ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇదివరకే ఆ విషయంలో అమ్మడు కొందరికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి రెండు పాత్రల విషయంలో దర్శకుడు అంచనలను అందుకోలేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











