హఠాత్తుగా అస్వస్థతకు గురైన డైరెక్టర్ సుకుమార్.. మరోసారి పుష్ప షూటింగ్ వాయిదా..
టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ దర్శకుల్లో ఒకరైన సుకుమార్ మొదటిసారి పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో మూడవసారి వర్క్ చేస్తుండడంతో అంచనాలు అకాశాన్ని దాటేశాయి. ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక రెండు భాగాలుగా వస్తుందని తెలియడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

మరోసారి బ్రేక్
ప్రస్తుతం సినిమా ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎలాగైనా రెండు నెలల్లో ఆ పనులన్నీ పూర్తి చేసి ప్రమోషన్ డోస్ పెంచాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. ఇటీవల సెకండ్ వేవ్ అనంతరం కాస్త సందడిగా మొదలైన షూటింగ్ కు సుకుమార్ అనారోగ్యంతో మరోసారి బ్రేక్ పడింది.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే పర్సనల్ వైద్యులను సంప్రదించిన సుకుమార్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. వైరల్ ఫీవర్ అని తెలుస్తోంది. పరిస్థితి నిలకడగానే ఉందట. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ లోని సభ్యులు చెబుతున్నారు. నిర్మాతలు కూడా సుకుమార్ కోలుకునే వరకు డిస్టర్బ్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు.

త్వరలోనే దేవిశ్రీప్రసాద్ సందడి
ఇక పుష్ప పార్ట్ 1కు సంబంధించిన ప్రమోషన్ త్వరలోనే స్టార్ట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. మేకింగ్ వీడియో లేదా ఒక సాంగ్ తో మంచి బజ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే సాంగ్స్ విడుదల కాకముందే హిట్టని చెప్పవచ్చు. నార్మల్ లవ్ స్టొరీలతోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ కాంబో ఈసారి పాన్ ఇండియా సినిమాను టచ్ చేస్తున్నారు కాబట్టి మ్యూజిక్ అంతకు మించి అనేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Recommended Video


రిలీజ్ ఎప్పుడంటే?
ఇక పుష్ప సినిమా రిలీజ్ విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. కరోనా థర్డ్ వేవ్ వలన ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అసలైతే ఆగస్ట్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ వలన షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











