Pushpa Trailer Review: పుష్ప అంటే పువ్వు కాదు.. ఫైర్.. ట్రైలర్‌లోనే తడాఖా చూపించిన బన్నీ
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ నేటి సాయంత్రం 6.03 గంటలకు విడుదల కావాల్సి ఉంది. అయితే ఎట్టకేలకు మూడు గంటల ఆలస్యంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మూడు గంటలు ఆలస్యంగా
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్ప మీద ఎంతటి అంచనాలున్నాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మైత్రీ మూవీస్, పుష్ప యూనిట్ మాత్రం బన్నీ అభిమానులను ముందు నిరాశలో ముంచెత్తి, ఆ తర్వాత కోపం తెప్పించేలా చేసింది. నిజానికి సోమవారామ్ సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయాల్సిన ట్రైలర్‌ను వాయిదా వేశారు.

అప్డేట్ ఇవ్వకపోవడంతో
ముందు బన్నీ అభిమానులకు నిరాశ ముంచుకొచ్చింది, ఎంత సేపటికి సరి అయినా అప్డేట్ ఇవ్వకపోవడంతో చిర్రెత్తుకొచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగానే వాయిదా వేస్తున్నామని మైత్రీ వాళ్ళు చెబుతున్నా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. మళ్లీ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో చెబుతామని, అప్పటి వరకు స్టే ట్యూన్ అంటూ ఓ ట్వీట్లకు చేస్తూ వచ్చారు.

మెయిన్ ప్లస్ పాయింట్
ఇక ఎట్టకేలకు మూడు గంటలు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. ఇక ఒక్కో పాత్రను పరిచయం చేసిన తీరు, ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు, అడవిలో సాగే సన్నివేశాలు ట్రైలర్ ను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి అనే చెప్పాలి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పచు.

మాస్ పాత్రలో బన్నీ
ఈ ట్రైలర్ లో బన్నీ నట విశ్వరూపం చూపించగా పూర్తి స్థాయి మాస్ పాత్రలో బన్నీ ఇరగదీశాడు. ట్రైలర్ ఆసాంతం యాక్షన్ సన్నివేశాలతో కట్ చేశారు. లారీ డ్రైవర్ గా, డాన్ గా రష్మిక వెంట పడే లవర్ బాయ్ గా పుష్పరాజ్ పాత్రలో కనిపించాడు బన్నీ. అలాగే ఈ సినిమా సునీల్ విలన్ గా కనిపించాడు.. అలాగే ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే, పుష్ప అంటే పువ్వు కాదు.. ఫైర్. అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫహద్ పార్టీ ఏది అంటే ఇస్తున్నానని చెబుతూ చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది.

ఎంజాయ్ చేస్తున్నారు
ఒకరకంగా బన్నీ అభిమానులు లేట్ అయినందుకు ఎంత బాధ పడ్డారో ఇప్పుడు అంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా అనసూయ, అజయ్ ఘోష్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Recommended Video

డిసెంబరు 17న
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న. ఈ సినిమాని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రెండు భాగాలుగా నిర్మిస్తోంది. పుష్ప 'ది రైజ్' పేరుతో తొలి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకురానుంది. 'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











