పుష్ప నుంచి అసలైన అప్డేట్.. అందరిలో టెన్షన్ టెన్షన్.. అది క్లిక్కవ్వకపోతే, ఇక అంతే!
సినిమా స్థాయి పెరగాలంటే ఈ రోజుల్లో తప్పకుండా ఏదో ఒక రకంగా హైప్ క్రియేట్ అవ్వాలి. సినిమాకి సంబంధించిన టీజర్ పోస్టర్స్ ద్వారానే జనాలు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతుంటారు. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ క్లిక్కవ్వాలి అంటే కూడా ప్రమోషన్ డోస్ అంతకు మించి అనేలా ఉండాలి. అయితే ఇప్పుడు అందరిలోనూ పుష్పకు సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ పైనే ఉంది. అదొక్కటి క్లిక్కయితేనే సినిమా స్థాయి పెరిగే ఛాన్స్ ఉంటుంది.
ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా

ఊర మాస్ స్టైల్
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్పపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ మొదటిసారి ఒక ఊర మాస్ స్టైల్ లో కనిపించబోతున్నాడు అనగానే అభిమానులు సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

నార్త్ జనాల్లో కూడా
అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో ఒక లారీ డ్రైవర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ టీజర్ రాగానే నార్త్ జనాల్లో కూడా సినిమాపై ఒక్కసారిగా ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమాకు బజ్ అయితే గట్టిగానే ఉన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక సుకుమార్ కు బాధ్యత కూడా పెరిగింది.

పుష్ప విలన్ పాత్ర కోసం
సినిమా అన్ని వర్గాల అడియెన్స్ ను ఆకట్టుకునేల ఉండాలి. ఇక హీరో కంటే కూడా విలన్ పవర్ఫుల్ గా ఉంటేనే సినిమా స్థాయి మరింత పెరుగుతుంది. ఇక పుష్ప విలన్ పాత్ర కోసం చాలా మంది అగ్ర నటీనటులను అనుకోని చివరికి ఫాహద్ ఫాజిల్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇతను నేషనల్ వైడ్ బెస్ట్ టాలెంటెడ్ నటులలో ఒకరని అందరికి తెలిసిన విషయమే.

టెన్షన్ మొదలైంది
మలయాళం నటుడిగా ఫాహద్ ఫాజిల్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే ఈ నటుడిని పుష్పలో బన్నీ కంటే పవర్ఫుల్ గా చూపించబోతున్నారట. పుష్ప రాజ్ కూడా క్లైమాక్స్ లో అతన్ని అంతకంటే పవర్ఫుల్ గా దెబ్బ కొడతాడట. ఇక విలన్ ఇక ఫస్ట్ లుక్ టీజర్ కూడా రెడీ ఆవుతున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ డోస్ పెరగాలి అంటే ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా క్లిక్కవ్వాలని పుష్ప టీమ్ చాలా తెలివిగా ఫస్ట్ లుక్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరిలో టెన్షన్ కూడా మొదలైనట్లు సమాచారం. మరి ఆ టీజర్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











