twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa Event: నాకు ఎన్ని ఉన్నా.. నేను సంపాదించింది ఇదొక్కటే.. అల్లు అర్జున్ పవర్ఫుల్ స్పీచ్

    |

    సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరపైకి రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి కొరటాల శివ అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ తన మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

     తగ్గేదే లే..

    తగ్గేదే లే..


    అల్లు అర్జున్ మొదట పుష్ప రాజ్ గా తనదైన బాడీ లాంగ్వేజ్ తో అలాగే మాటలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తగ్గేదే లే అనే డైలాగ్ తో కూడా అలరించారు. మైక్ సౌండ్ కూడా పెంచాలి అంటూ అభిమానులందరికీ కూడా తన మాటలతో మంచి ఊపు ఇచ్చాడు. ఏ విషయంలోనూ తగ్గేదే లేదు అంటూ ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లు తన మాటలతో పుష్పరాజ్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    నాకు మాత్రం ఆర్మీ ఉంది..

    నాకు మాత్రం ఆర్మీ ఉంది..


    ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేను ఎప్పటినుంచో చెబుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది నేను ఇంతవరకు ఏదైనా సంపాదించుకున్నాను అంటే అది మీ అభిమానమే. నాకు అంత కంటే కూడా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. నన్ను నమ్మండి. నాకు అందరి కంటే అన్నిటికంటే ఎక్కువగా కూడా నా ఫ్యాన్స్ చాలా ఇష్టం ఐ లవ్ యు చెబుతున్నాను మీకు. ముఖ్యంగా ఈ వేడుకకు వచ్చిన అతిథులకు మీడియా మిత్రులకు అలాగే రాజమౌళి గారికి కొరటాల శివ గారికి అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు మా జర్నీ స్టార్ట్ అయ్యి 3వ దశకంలోకి అడుగుపెట్టింది. ప్రతి సారి కూడా నా సినిమాలకు దేవి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఇక పుష్ప రాజ్ సినిమాలో కూడా ప్రతి పాట అందిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఎనర్జీ అంతా ఇంతా కాదు.

    హ్యాపీగా ఉంది..

    హ్యాపీగా ఉంది..

    ఈరోజు దేవి లేనందుకు చాలా మిస్ అవుతున్నాను. సుకుమార్ కూడా ఇక్కడ ఉండాల్సింది. వారందరినీ చాలా మిస్ అవుతున్నాను. నాకు తెలుసు ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ వ్యాప్తమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి కష్టపడుతున్నాడు అని. రెండేళ్ల కష్టం కాబట్టి తప్పకుండా అన్ని విషయాలు గురించి మాట్లాడతాను. చంద్రబోస్ కార్ కూడా అద్భుతమైన లిరిక్స్ రాశారు. చంద్రబోస్ గారు సినిమాలకోసం పాటలు రాసే దగ్గర నుంచి వాళ్లని స్ఫూర్తినిచ్చే వరకు వెళ్లారు.. అలాంటి వారు నా సినిమాలో డిఫరెంట్ సాంగ్స్ రాయడం నాకు చాలా హ్యాపీగా ఉంది.

    నాలుగు సినిమాలకు పడినంత కష్టం

    నాలుగు సినిమాలకు పడినంత కష్టం

    ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి గురించి కూడా ఈరోజు మాట్లాడాలి. సినిమాటోగ్రాఫర్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాలి. ఆయన ఈ సినిమాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకు నిరంతరంగా కష్టపడుతూనే ఉన్నారు. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట చెప్పగలను. ఈ ఒక్క సినిమా కూడా నాలుగు సినిమాలకు పడినంత కష్టం అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం కష్ట పడిన వారికి పేరుపేరునా నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

    క్రష్మీక అని పిలుస్తాను

    క్రష్మీక అని పిలుస్తాను

    రష్మిక గురించి మాట్లాడుతూ.. ఈ అమ్మాయిని నేను సరదాగా క్రష్మీక అని పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే ఆమె నేషనల్ క్రష్ కాబట్టి నేను అలాగే పిలుస్తాను. మనం చాలా మంది తో పని చేస్తాం. కానీ కొంతమంది మాత్రమే మనసులో నిలిచిపోతారు అలాంటి వారిలో రష్మిక మందన కూడా నా మనసుకు ఎంతగానో నచ్చింది. అమ్మాయి చాలా టాలెంటెడ్. రానున్న రోజుల్లో సరైన దర్శకులు ఆమెతో సరైన స్క్రిప్ట్ తీయగలిగితే ఆమె మరో స్థాయికి వెళుతుంది అని చెప్పగలను. ఇక సమంత గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆమె ఐటెమ్ పాట విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా మేము ఎలా అడిగితే అలా తన వృత్తికి న్యాయం చేశారు. సినిమాలో ఈ పాట మాత్రం మామూలుగా ఉండదు అన్నట్లుగా ఉంటుంది అని వివరణ ఇచ్చాడు.

    మా మామయ్య చనిపోయారు

    మా మామయ్య చనిపోయారు


    అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన సునీల్ అనసూయ అజయ్ ఘోష్ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు. వారందరూ కూడా ఒక ఈ సినిమాకు ఎంతో సహాయ పడ్డారు. అందుకే వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆర్టిస్టులలో నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది భన్వర్ సింగ్ షెకావత్.. పాత్రలో కనిపించిన ఫాహాద్ ఫాజిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో అతనితో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మేమిద్దరం చేసిన సీన్స్ కూడా అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను.
    మైత్రి మూవీస్ లేని ఈ సినిమా ఇంత ఈజీగా పూర్తి అయ్యేది కాదు అని నేను చాలా బలంగా చెబుతున్నాను. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా ముత్తంశెట్టి అనే మరో బ్యానర్ వారు కూడా కలిసి వర్క్ చేశారు. వాళ్ళు మా మామయ్యలు. నాకు చిన్నప్పుడు వారు ఎంతగానో ప్రేమ చూపించారు ఇప్పుడు వాళ్లని పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మొదలు పెట్టాక మా మాతో మామయ్య చనిపోయారు. ఆయనను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.

    షాక్ అయ్యాను..

    షాక్ అయ్యాను..

    ఇక ఫైనల్ గా సుకుమార్ గురించి మాట్లాడుతూ.. సుకుమార్ గారు ఈ ఫంక్షన్ కు రావడం లేదు అని నాకు సాయంత్రం చెప్పారు. నేను వెంటనే షాక్ అయ్యాను. సుకుమార్ లేకుండా ఫంక్షన్ జరగడం ఏమిటి అని సమాధానం ఇచ్చి ఫోన్ చేశాను. ప్రైవేట్ జెట్ కూడా పెడతాను. వెంటనే నువ్వు వచ్చేయాలి అని ఫోన్ చేశాను. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. అయితే సుకుమార్ మాత్రం చాలా సింపుల్ గా నేను రావడం లేదు అని నన్ను కన్విన్స్ చేసాడు. ఇంకా రావడం కుదరదు అని ఫైనల్ గా అడిగితే సుకుమార్ గారు ఒక మాట చెప్పారు. డార్లింగ్ నువ్వు వెళ్ళు.. ప్రాడక్ట్ బాగా వచ్చే వరకు ఆఖరి నిమిషం వరకు కూడా తగ్గేది లేదు అని చెప్పి తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని గట్టిగా చెప్పు అని నాతో అన్నారు.

    ఇంతకంటే పెద్ద పార్టీ ఏముంటుంది

    ఇంతకంటే పెద్ద పార్టీ ఏముంటుంది

    లాస్ట్ వరకు కష్ట పడుతున్న దేవికి అలాగే సుకుమార్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సుకుమార్ ఒక మాట కూడా చెప్పాడు ఇక్కడ నువ్వు నేను కాదు. ఇది మనం. రేపు నీకు మంచి పేరు వచ్చినా అది మనకే దక్కుతుంది.. అని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే సినిమా చేశాను. డిసెంబర్ 17న వచ్చే శుక్రవారం మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వరల్డ్ వైడ్ గా పుష్పరాజ్ విడుదలవుతోంది. ఇంతకంటే పెద్ద పార్టీ మరొకటి ఏమి ఉంటుంది.

    Recommended Video

    Multi Starrer Movie With Mahesh Babu, Ram Charan ? || Filmibeat Telugu
    అన్ని సినిమాలు హిట్టవ్వాలి..

    అన్ని సినిమాలు హిట్టవ్వాలి..


    అఖండ సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ గారికి బోయపాటి శ్రీను గారికి థియేటర్లు పూనకాలు తెప్పించిన థమన్ గారికి అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక అదే ఉపును ఇప్పుడు మేము డిసెంబర్ 17న కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సినిమాల గెలవాలి అనుకుంటున్నాను. అలాగే శ్యామ్ సింగరాయ్, RRR, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ప్రతీ ఒక్క సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు బన్నీ వివరణ ఇచ్చారు.

    English summary
    Pushpa Pre Release Event allu arjun speech, speech
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X