Pushpa Pre Release Event: బన్నీ అంటే బన్ను కాదు.. సుకుమార్ గారు అందుకే రాలేదు: బుచ్చిబాబు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరపైకి రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వేడుకలో దర్శకులు మారుతి, బుచ్చి బాబు కూడా వారి మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. సాధారణంగా అల్లు అర్జున్ ని చూస్తేనే ఎంతగానో ఎనర్జీ వస్తుంది. ఇక వారి అభిమానుల నుంచి చూస్తే కూడా అదే తరహాలో ఫీలింగ్ కలుగుతుంది. చాలా రోజుల తర్వాత ఇంత మంది జనాలు నడుమ ఇలాంటి సినిమా ఈవెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అభిమానులను అలరించడానికి బన్నీ ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. తప్పకుండా ఈ సినిమా కోసం అతను డబుల్ ఎనర్జీతో కనిపించబోతున్నాడు. ఇక పుష్ప అంటే పువ్వు కాదు అలాగే.. బన్నీ అంటే బన్ను కాదు డబుల్ బ్లాక్ బస్టర్.. అని మారుతి తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

బుచ్చిబాబు మాట్లాడుతూ.. ముందుగా కొరటాల శివ ఆచార్య కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళి గారు ఒక్క ఆర్ ఉంటేనే పిచ్చెక్కిపోతుంది. ఇక ముందు వెనకాల రామ్ చరణ్ రామారావు వంటి ఆర్ లతో వస్తున్నారు అంటే జనాలు ఏమైపోతారో అనిపిస్తుంది. ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను సర్ అని రాజమౌళి గారికి బుచ్చిబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ వేడుక కోసం సుకుమార్ గారు రాలేదు.. ఎందుకంటే ఆయన ముంబైలో మిక్సింగ్ లో ఉన్నారు. రావడానికి వీలు పడదు. ఆయన లెక్కల మాస్టర్ గా ఉన్నప్పుడు ఒక సైకిల్ మీద వచ్చిన ఇప్పుడు పెద్ద కారులో వచ్చిన కూడా ఏమీ మారలేదు. ఆయన సినిమా కోసం చాలా బాగా కష్ట పడతారు.
అయితే సినిమా రిలీజ్ ఈవెంట్ కోసం మీరు తప్పకుండా రావాలి సార్ అని నేను అన్నప్పుడు మనకంటే సినిమా పెద్దది.. యూఎస్ రిలీజ్ కోసం క్వాలిటీ చాలా బాగా ఉండాలి కాబట్టి వాటి కోసం మిక్సింగ్ లో బిజీగా ఉన్నాను అని చెప్పారు. అందుకే సుకుమార్ రాలేదు అని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. ఇక నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అంచనాలకు తగ్గట్లుగా నిర్మిస్తున్నారు. ఒకేసారి పది పన్నెండు సినిమాలను లైన్ లో పెట్టారు అంటే మామూలు విషయం కాదు. వారి మంచి తనం వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. ఇక పుష్పరాజ్ సినిమాను నేను ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ లో చాలా సార్లు చూసాను. సినిమా చూసిన తర్వాత పుష్ప రాజ్ ను ఎవరు మర్చిపోలేరు. ఆ ఎనర్జీ అయితే చాలా కాలం ఉంటుంది అభిమానుల్లో.. అని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











