150కోట్ల పెట్టుబడి.. భారమంతా సుకుమార్ పైనే.. తెలిసే చేశారా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా పుష్ప కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బ్రేకులు చాలానే పడ్డాయి.
అసలే సినిమా షూటింగ్ కు కరోనా గట్టి దెబ్బె వేసింది. ఇక సుకుమార్ రాజమౌళి కంటే చాలా లేట్ అని అందరికి తెలిసిందే. ఇక ధైర్యంగా సినిమాను మొదలు పెట్టినప్పటికి మొన్నటి వరకు కరోనా భయం తగ్గలేదు. అవుట్ డోర్ షూటింగ్ కు ఈ మధ్య బాగానే బ్రేకులు పడ్డాయి. ఇక పుష్ప సీన్స్ ను చాలా వరకు ఫారెస్ట్ లలోనే చిత్రీకరించాలి కాబట్టి అధిక సంఖ్యలో యూనిట్ సభ్యులు పాల్గొనాల్సి వస్తోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక మొత్తానికి ఇటీవల చిత్ర యూనిట్ షూటింగ్ పనుల్లో వేగాన్ని అయితే పెంచేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సుకుమార్ పైనే పెద్ద భారాన్ని మోపారు చిత్ర నిర్మాతలు. ఎందుకంటే సినిమా విడుదల తేదీని ఇటీవల ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఏ మాత్రం మార్చకూడదు.
అంతా బాగానే ఉంది గాని సినిమాను చెప్పిన డేట్ కు తీసుకువస్తారా లేదా అనేది అసలు పాయింట్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను దాదాపు 150కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆగస్ట్ 13 చాలా వరకు శ్రేయస్కరమే. ఆ సమయానికి పెద్ద సినిమాలు కూడా లేవు. ముందుగానే ఎనౌన్స్ చేశారు కాబట్టి పెద్ద సినిమాలు ఆ దరిదాపుల్లోకి రావు. అందుకే పుష్ప టీమ్ కూడా తేదీని ఏ మాత్రం మార్చకూడదు.

ఐదు నెలల్లోనే..
అయితే ఇప్పటివరకు పుష్ప షూటింగ్ 30 శాతం కూడా పూర్తవ్వలేదట. ఇంకా సగానికి పైగా షూటింగ్ పార్ట్ మిగిలి ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు కాబట్టి వాటికే నెలల సమయం పడుతుంది. ఇక ఇప్పుడు కేవలం ఐదు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలోనే షూటింగ్ పనులను పూర్తి చేయాలి.
Recommended Video

రిలీజ్ వాయిదా పడితే..
సుకుమార్ తన కెరీర్ లో ఏ సినిమాను కూడా అంత తొందరగా ఫినిష్ చేయలేదు. మరి ఆయన సంగతి తెలిసే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా రిలీజ్ వాయిదా పడితే మళ్ళీ వేరే సినిమాల వాళ్ళు గోల చేయడం కాయం. అది పుష్పకు కూడా మంచిది కాదు. నిర్మాతలైతే సుకుమార్ పైనే భారం వేశారు. మరి 150కోట్ల ప్రాజెక్టును ఆయన అనుకున్న సమయానికి ఎలా తెస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











