వారికి "పుష్ప"రాజ్ రప్పా రప్పా వార్నింగ్ .. యాక్షన్ తప్పదంటూ షాకింగ్ పోస్ట్
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ డిసెంబర్ నెల ముగింపు ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు. గత ఏడాదికి వచ్చిన ఆనిమల్ సినిమా ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిస్తే ఈ ఏడాది డిసెంబర్ నెలలో వచ్చిన బిగ్గెస్ట్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 సినిమా మాత్రం దానికి మించి బ్లాక్‌బస్టర్ అయ్యి రికార్డు వసూళ్లు అందుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా ఇపుడు 1500 కోట్లకి పైగా అందుకొని దుమ్ము లేపింది.
అయితే ఈ సినిమా విడుదల అయ్యి వసూళ్లు, బ్లాక్ బస్టర్ టాక్‌ని కూడా అందుకుంది కానీ కావాల్సినంత నెగిటివ్ కూడా తెచ్చుకుంది. కాగా దీనికి ముందు నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అండ్ మెగా అభిమానుల నడుమ భారీ ఎత్తున నెగిటివ్ ఫ్యాన్ వార్స్ జరుగుతూ వచ్చాయి. దీంతో సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ లేచిపోగా అప్పుడు పెద్దగా అల్లు అర్జున్ పట్టించుకోలేదు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా వరకు హద్దులు దాటారు అనే టాక్ కూడా ఉంది. దీనితో పాటుగా సినిమా రిలీజ్ అయ్యిన సమయంలో జరిగిన దుర్ఘటనతో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్‌కి నడుమ చీలిక వచ్చింది. పైగా అల్లు అర్జున్‌పై ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేయడం కూడా జరిగింది. దీనితో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.
సీఎంపై కూడా చాలా కామెంట్స్ చేయగా తెలంగాణ పోలీస్ వారికి కూడా వారిపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు వచ్చాయి. దీనితో సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెట్టారో వారంతా డేంజర్ జోన్‌లో పడినట్లే. ఇపుడు లేటెస్ట్‌గా అల్లు అర్జున్ నుంచే తన ఫ్యాన్స్ కి వార్నింగ్ రావడం గమనార్హం. తాను అఫీషియల్ గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి, అలాగే తన ఫ్యాన్స్ కాని వారికి కూడా రప్పా రప్పా వార్నింగ్ ఇచ్చాడు పుష్ప రాజ్.
ముందుగా తన ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా పోస్ట్ చేయాలనీ ఎవరినీ కించపరిచేలా పోస్ట్ లు పెట్టొద్దు అంటూ తాను హుకుం ఇచ్చాడు. అలాగే తన అభిమానుల పేరిట ఎవరైతే సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్‌లో ఫేక్ పోస్టులు పెట్టారో వారి అందరిపై చర్యలు తీసుకోబడతాయి. అలాంటి నెగిటివ్ పోస్ట్‌లు వేస్తున్నవారికి దూరంగా ఉండాలి అని నా ఫ్యాన్స్ కి సూచిస్తున్నాను అంటూ బన్నీ అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. దీనితో ఫాన్స్ ముసుగులో ఉన్నవారికి అలాగే నెగిటివ్ పోస్ట్‌లు చేస్తున్న ఫ్యాన్స్ కి కూడా బన్నీ సైడ్ నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. మరి అల్లు అర్జున్ కోసం వీరు సోషల్ మీడియాలో ఎంత కంట్రోల్ లో ఉంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











