పుష్ప vs సర్కారు వారి పాట... కోట్లు కురిపిస్తున్నారు.. ఆ ఒక్క ఏరియాలోనే అదిరిపోయే డీల్స్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మార్కెట్ సినిమా సినిమాకు ఎంతగానో పెరుగుతోంది. ఇక పాన్ ఇండియా ప్రాజెక్టులతో కూడా ఒకరి తరువాత మరొకరు పట్టాలెక్కించేస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా అంచనాలు పెంచేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్, అల్లు అర్జున్ సినిమాల వాల్యూ కూడా అంచనాలకు తగ్గట్లుగానే పెరుగుతోంది. ఒక్క ఉత్తరాంధ్రలోనే నెవర్ బిఫోర్ అనేలా డీల్స్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.

పుష్ప కోసం భారీ బడ్జెట్
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్పపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నెవర్ బిఫోర్ అనేలా రెడీ అవుతున్న ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ మొదటిసారి భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమా కోసం దాదాపు 170కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్ వస్తోంది.

మహేష్.. బాక్సాఫీస్ మూవీ
ఇక మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సర్కారు వారి పాట కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మహేష్ మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటిస్తే బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే. గీతగోవిందం లాంటి హిట్టు తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాకు అన్ని ఏరియాల నుంచి సాలీడ్ ఆఫర్స్ వస్తున్నాయి.

ఆ ఏరియాలో భారీ డిమాండ్
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాలకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ లో భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అల్లు అర్జున్ పుష్ప సినిమాకు కూడా మంచి డీల్ సెట్టయినట్లు తెలుస్తోంది. ఈ ఏరియాలో ఇద్దరి హీరోలకు మంచి మార్కెట్ ఉంది.

ఇద్దరి సినిమాలకు 15కోట్లు
మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ఉత్తరాంధ్ర రైట్స్ కోసం AV సినిమాస్, గాయత్రి ఫిలిమ్స్ పోటీ పడుతున్నట్లు సమాచారం. సినిమా హక్కుల ధర 15కోట్ల వరకు పలుకుతున్నట్లు సమాచారం. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమా ఉత్తరాంధ్ర హక్కులను గాయత్రి ఫిలిమ్స్ 15కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











