Pushpa 2: సమంత తరువాత మరో బ్యూటీతో ఘాటైన ఐటెమ్ సాంగ్.. సుక్కు న్యూ ప్లాన్

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన మూడవ చిత్రం పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రివ్యూల అనుకున్నంతగా పాజిటివ్ గా రాకపోయినప్పటికీ కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా వరకు మంచి లాభాలను అందించింది. ఇక మొదటి పాటు మంచి విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగాన్ని కూడా అంతకు మించి అనేలా తెరకెక్కించాలని దర్శకుడు సుకుమార్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ లో సమంతతో చేయించిన ఐటెం సాంగ్ అన్ని భాషల్లోనూ వర్కౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ పార్ట్ ది రూల్ లో కూడా ఐటెమ్ సాంగ్ ఉండాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే మరోసారి సమంత తోనే ఐటమ్ సాంగ్ చేయిస్తారా లేక పోతే మరొక హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటారా అని విషయాల్లో కూడా అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రీసెంట్ గా దర్శకుడు సుకుమార్ ఒక పేరును ఫైనల్ చేసే ఆలోచనలో వచ్చినట్లు సమాచారం. పుష్ప మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోవడంతో సెకండ్ పార్ట్ కోసం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ లలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలి అని దర్శకుడు నిర్మాతలు చర్చించుకున్నారట.

Pushpa the rule movie special song heroine almost finalised

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంటున్న దిశా పటానిని ఫైనల్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక పుష్ప సెకండ్ పార్ట్ ఐటమ్ సాంగ్ లో నటించేందుకు దిశా కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దిశాపటానితో అగ్రిమెంట్ చేసుకొని భారీ స్థాయిలో పారితోషికం ఇవ్వడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే ఫస్ట్ పార్ట్ లో దాదాపు అన్ని పాటలు కూడా ఈ సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక సెకండ్ పార్ట్ కోసం ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక పుష్ప:ది రూల్ షూటింగ్ అయితే దాదాపు 80 శాతానికి పైగా పూర్తయింది. ఇక మిగిలిన 20 శాతం షూటింగ్ ను పూర్తి చేయడానికి పెద్దగా సమయం పట్టదు. కానీ సుకుమార్ మాత్రం సెకండ్ పార్ట్ లో ఉండే కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాలని ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రణాళికను కూడా తన సహాయ దర్శకులకు తెలియజేసినట్లు సమాచారం. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మంచి సక్సెస్ ఇవ్వడంతో ఇప్పుడు రెండవ భాగం విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇక సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది సమ్మర్లో ఫినిష్ చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ పెంచాలని చూస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే ఏడాది డిసెంబర్ లో లేదా ఆ తర్వాత ఏడాది మొదట్లోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X