Pushpa 2: పుష్ప గాడు రూల్ చేసేది అప్పుడే.. వాయిదాపై ఇదిగో అసలైన క్లారిటీ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా సత్తా చాటుతోన్న హీరోలు కొందరు ఉన్నారు. అయితే, వీళ్లలో ఒకే ఒక్క హీరో మాత్రమే తనదైన మ్యానరిజంతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు. అతడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ది రైజ్' సినిమాతో బన్నీ భారీ విజయంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు.
'పుష్ప ది రైజ్' ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని రూపొందిస్తున్నారు. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న అంశంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు.

'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను వాయిదా వేయబోతున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
వాస్తవానికి 'పుష్ప ది రూల్' మూవీని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే అధికారికంగా ప్రకటించింది. అయితే, దీన్ని డిసెంబర్ నెలలో తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీనికి షూటింగ్ ఆలస్యం కావడమే కారణం అని సమాచారం. దీంతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

'పుష్ప ది రూల్' వాయిదా అంటూ వస్తున్న వార్తలతో బన్నీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించిన మూవీ యూనిట్.. 'పుష్ప ది రూల్ ఆగస్టు 15వ తేదీనే విడుదల అవుతుంది' అని స్పష్టం చేసింది. దీంతో ఇది వాయిదా పడిందన్న వార్తలకు పుల్‌స్టాప్ వేసేసింది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











