Pushpa 2: పుష్ప 2 టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. పలువురు ఆర్టిస్టులకు గాయాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. ఐదు భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.
దీంతో పాటు హిందీ ఆడియెన్స్‌ను కూడా మెప్పించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది. ఫలితంగా ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని చేస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ యూనిట్ రోడ్డు ప్రమాదానికి గురైంది.

కొద్ది రోజులుగా 'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించిన షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో జరుగుతోంది. తాజాగా అక్కడ షెడ్యూల్ ముగియడంతో కొందరు జూనియర్ ఆర్టిస్టులు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.
ఈ క్రమంలోనే వాళ్లు ప్రయాణిస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు నార్కట్‌పల్లి దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది. దీంతో వాళ్లను దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారని సమాచారం. ఈ సంఘటనతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.

మారేడుమిల్లిలో జరుగుతున్న షెడ్యూల్ ముగియడంతో 'పుష్ప ది రూల్'లో నటించిన కొందరు ఆర్టిస్టులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు పయణమయ్యారు. ఈ క్రమంలోనే నార్కట్‌పల్లి చేరుకోగానే ఆ బస్సు.. ముందు వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తోన్న 'పుష్ప' ఆర్టిస్టులు పలువురు గాయపడినట్లు తెలిసింది. అలాగే, ఆర్టీసీ బస్సులో ఉన్న కొందరికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం. వాళ్లంతా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంటున్నారని తెలిసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వస్తున్న 'పుష్ప ది రూల్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మారేడుమిల్లిలో జరిగిన షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











