Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన రీతిలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ.. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో బడా హీరోగా సత్తా చాటుతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇలా కెరీర్ ఆరంభం నుంచీ తెలుగులో భారీ చిత్రాలు చేస్తోన్న అతడు.. లెక్కల మాస్టారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ అయింది.
'పుష్ప ద రైజ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ కావడంతో.. ఈ సినిమా రెండో పార్ట్ 'పుష్ప ద రూల్'పై అంచనాలు ఆకాశం అంతగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ భాగానికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ మరింత ఉత్సాహంగా జరుపుతోంది. ఇలా ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగానికి సంబంధించిన షూట్‌ను కూడా శరవేగంగా జరిపేలా ప్రణాళికలు రూపొందించుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది.
'పుష్ప ది రూల్' కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా వేచి చూస్తున్నారు. కానీ, దీని నుంచి ఇప్పటి వరకూ అప్‌డేట్లు రాలేదు. దీంతో అందరూ నిరాశగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ వీడియోను వదులుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఏప్రిల్ 7వ తేదీ, సాయంత్రం 4.05 గంటలకు ఈ మూవీ నుంచి 'The HUNT before the RULE' అనే వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం తాజాగా ఓ వీడియోను వదిలారు. ఇందులో 'తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ' అంటూ న్యూస్ వచ్చినట్లు చూపించి దీనిపై ఆసక్తిని పెంచేశారు.

అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమానే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











