Don't Miss!
- Finance
LIC: రెండు రోజుల్లో రూ.16,580 కోట్లు నష్టపోయిన ఎల్ఐసీ.. ఆందోళనలో పెట్టుబడిదారులు..!
- News
భర్తతో గొడవ: కొరికేసింది.. సీన్ కట్ చూస్తే..!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Pushpa The Rule: పుష్ప మూవీ నుంచి మరో లీక్.. ఇవి చూస్తే కాలర్ ఎగరేస్తారు!
సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే టాలీవుడ్‌లో సత్తాను నిరూపించుకున్న అతడు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.
డ్రెస్ సైజ్ తగ్గించిన బాలయ్య హీరోయిన్: పైన మాత్రం ఏమీ లేకుండానే!
'పుష్ప ద రైజ్' సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా రెండో భాగం 'పుష్ప ద రూల్' మూవీపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అలాగే, వచ్చే వారం నుంచే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని డైలాగుల గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చేసింది.

'పుష్ప ద రూల్'లో పుష్పరాజ్ గంథపు చెక్కల మాఫియాకు రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఇక, ఇందులో హీరో ఎలివేషన్స్ హై లెవెల్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక, తాజాగా ఈ చిత్రం నుంచి రెండు డైలాగులు లీక్ అయ్యాయి. 'అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే పులి వచ్చిందని అర్ధం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేస్తే పుష్పరాజ్ వచ్చాడని అర్థం', 'వాళ్లు గొర్నెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొరెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను' అంటూ బన్నీ నోటి వెంట డైలాగులు పేలబోతున్నాయని తెలిసింది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
బ్రాలో తెగించిన హీరోయిన్: అమాంతం అది విప్పేసి మరీ హాట్ షో
అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.