For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుష్పక విమానం స్ట్రీమింగ్ డేట్ ప్రకటన: ఆ ఓటీటీలో రాబోతున్న ఆనంద్ దేవరకొండ మూవీ

  |

  రెండేళ్ల క్రితం వచ్చిన 'దొరసాని' అనే ప్రేమ కథా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ. మొదటి చిత్రంలోనే మంచి నటనతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన అతడు.. విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని ద్వారా అతడు తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఇది ఓటీటీలో విడుదల కావడంతో చాలా మంది ప్రేక్షకులకు మాత్రం చేరువ కాలేకపోయాడీ యంగ్ హీరో.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రమే 'పుష్పక విమానం'. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దామోదర అనే దర్శకుడు తెరకెక్కించాడు. దీన్ని విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మించడంతో ఆరంభం నుంచే దీనిపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో విడుదలకు ముందు మంచి బజ్‌ను ఏర్పరచుకోవడంతో పాటు బిజినెస్‌ను కూడా భారీ స్థాయిలో జరుపుకుంది. దీంతో ఇది చాలా గ్రాండ్‌గా విడుదలైంది.

  Pushpaka Vimanam streaming on Aha From December 10th

  ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండ 'పుష్పక విమానం' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదు. ఫలితంగా తొలి రోజు నుంచే కలెక్షన్లు అనుకున్న రేంజ్‌లో రాలేదు. ఆ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఓవర్సీస్‌లో కొంత పర్వాలేదనిపించినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పూర్తి నిరాశనే మిగిల్చింది. దీంతో రూ. 2.20 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమా.. ఫుల్ రన్‌లో కేవలం రూ. 1.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా దాదాపు యాభై లక్షల రూపాయల నష్టాలను ఎదుర్కొంది.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  థియేటర్లలో నిరాశనే ఎదుర్కొన్న 'పుష్పక విమానం' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి కొద్ది రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన ఆహా సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఇక, ఈ చిత్రాన్ని డిసెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సందరు సంస్థ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అంతేకాదు, హీరో పాత్ర గురించి వివరిస్తూ ఫన్నీ పోస్టును కూడా చేసింది. దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం దేవరకొండ ఫ్యామిలీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  'పుష్పక విమానం' మూవీలో ఆనంద్ దేవరకొండ భార్య లేచిపోయిన ఇనోసెంట్ భర్తగా నటించాడు. ఈ మూవీలో అతడు మరింత పరిణితి కలిగిన నటుడుగా కనిపించాడు. ఇక, ఇందులో శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటించారు. సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ బాషీ, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి రామ్ మిరియాల సంగీతం అందించాడు.

  English summary
  Tollywood Young Hero Vijay Devarakonda Brother Anand Deverakonda Did Pushpaka Vimanam Under Damodara Direction. This Movie streaming on Aha From December 10th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X