‘సాహో’ ట్రైలర్ చూసి పివి సింధు ఫిదా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
'సాహో' ట్రైలర్‌పై తాజాగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు స్పందించారు. 'సాహో ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇది చూసిన తర్వాత సినిమా చూడాలనే ఆసక్తి నాలో మరింత పెరిగింది. ప్రభాస్, శ్రద్దాకపూర్ మూవీ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఏర్పడింది. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.

ఈ చిత్రాన్ని హిందీతో తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కేవలం నార్త్ ఇండియాలోనే 4500 స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా, సౌతిండియా వ్యాప్తంగా దాదాపు 2 వేల స్క్రీన్లలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
సాహోలో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మహేష్ మంజ్రేకర్, మందిరా బేడీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల నుంచి నటీ నటులను ఎంపిక చేశారు.


Click it and Unblock the Notifications











