Rocketry రెస్పాన్స్ అదుర్స్.. అంతలోనే మాధవన్‌కు షాక్

మాధవన్ హీరో, దర్శకుడిగా వస్తోన్న చిత్రం రాకెట్రీ. మొదటిసారిగా దర్వకత్వం వహిస్తుండటంతో రాకెట్రీ సినిమాపై అందరికీ అంచనాలు పెరిగాయి. 1994లో దేశద్రోహిగా ముద్ర పడిన నంబి నారాయణ్ కథను ప్రజలకు చెప్పాలని,అందులోని చీకటి కోణాలను బయట పెట్టాలని మాధవన్ తానే సొంతంగా కథను రాసుకుని మరీ దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. నిన్న వదిలిన రాకెట్రీ ట్రైలర్ అద్భుతంగా క్లిక్ అయింది.

దేశ వ్యాప్తంగా రాకెట్రీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మాధవన్ ఇచ్చిన అప్డేట్‌తో అందరూ షాక్ అయ్యారు. మాధవన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించిందట. తన ఇంట్లో ఐదారు గురికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మాధవన్ ఎంతో కూల్‌గా చెప్పేశాడు. ప్రస్తుతం మాధవన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిన్న రాకెట్రీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాధవన్ నేడు ఇలా షాక్ ఇచ్చాడు.

R Madhavan about Rocketry and tests corona positive

ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషంగా అనిపించింది. నేను సాధారణంగా అందరికీ పర్సనల్‌గా రిప్లై ఇవ్వాలని అనుకున్నాను. కానీ నిన్న సాయంత్రం ఐదు గంటలకు నా ఇంట్లో ఐదుగురి కరోనా పాజిటివ్ అని తేలింది. హహహ దాని వల్ల నేను చాలా బిజీగా అయిపోయాను.. అన్నింటిని సక్రమంగా చూసుకోవాలని తిరుగుతున్నాను. మా ఇంట్లో అందరికీ పరీక్షలు చేయించాలి.. నా రిజల్ట్ కూడా రావాలి.. ఇవన్నీ సద్దుమణిగాక మళ్లీ మీ అందరికీ (ట్విట్టర్, ఇన్ స్టా) పర్సనల్‌గా రిప్లై ఇస్తాను. మీరు ఇచ్చిన రెస్పాన్స్‌తో ఎంతో సంతోషంగా ఉంది.. తామంతా బాగానే ఉన్నామని మాధవన్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X